Radha Yadav : వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న టీమ్ఇండియా స్టార్ స్పిన్న‌ర్..! ర‌క్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ రాధా యాద‌వ్ సైతం వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Team India Spinner Radha Yadav Rescued By NDRF Amid Gujarat Floods

గుజ‌రాత్ రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఫ‌లితంగా కొన్ని ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా వ‌డోద‌ర‌లో ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. వ‌ర్షాలు కాస్త తెరిపినిచ్చిన‌ప్ప‌టికి న‌గ‌రం గుండా ప్ర‌వ‌హించే విశ్వామిత్ర న‌దికి వ‌ర‌ద నీరు పోటెత్త‌డం, కొన్ని చోట్ల న‌ది క‌ట్ట‌లు తెగిపోవ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ రాధా యాద‌వ్ సైతం వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. చాలా దారుణ ప‌రిస్థితుల్లో చిక్కుకున్నామ‌ని, అయితే.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) త‌మ‌ను ర‌క్షించిన‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ స్టార్ స్పిన్న‌ర్ వెల్ల‌డించారు.

Shannon Gabriel : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన వెస్టిండీస్ స్టార్ పేస‌ర్ గాబ్రియెల్‌

త‌మ‌ని రక్షించినందుకు ఎన్‌డీఆర్ఎఫ్‌కి ధన్యవాదాలు తెలియ‌జేశారు. రోడ్డు పై నీరు ఉండ‌డంతో ప‌డ‌వ‌ల సాయంతో ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ప్ర‌జ‌ల‌ను రక్షిస్తున్న వీడియోను పోస్తు చేశారు.

బుధవారం.. సౌరాష్ట్ర ప్రాంతంలోని దేవభూమి ద్వారక, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్ జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వ‌ర‌కు 12 గంట‌ల వ్య‌వ‌ధిలో 50 మిమీ నుండి 200 మిమీ వరకు వర్షం కురిసింది. దేవభూమి ద్వారక జిల్లాలోని భన్వాడ్ తాలూకాలో 185 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం.

Virat Kohli : శుభ్‌మ‌న్ గిల్ పై కోహ్లీ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడా? అస‌లు నిజం ఇదే..

భారత వాతావరణ శాఖ సౌరాష్ట్రలోని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత మూడు రోజుల్లో వర్షాల కారణంగా రాజ్‌కోట్, ఆనంద్, మహిసాగర్, ఖేడా, అహ్మదాబాద్, మోర్బి, జునాగఢ్, బరూచ్ జిల్లాల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు