Team India Squad For Asia Cup 2025 Big Stars To Be Snubbed Report
ఇంగ్లాండ్ సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆసియా కప్ 2025 పై నిలిచింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో ఈ మెగాటోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. కాగా.. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఆగస్టు 19 లేదా 20 తేదీల్లో ఎంపిక చేయొచ్చు. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇప్పటికే సాధన ప్రారంభించాడు. అతడి ఫిట్‌నెస్ ను సెలక్టర్లు పరిశీలించనున్నారు.
కాగా.. ఆసియా కప్ 2025 జట్టులో పెద్దగా మార్పులు ఉండబోవని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు కూడిన బ్యాటింగ్ లైనప్ దాదాపుగా ఖాయం అని అంటున్నారు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. సంజూ శాంసన్ గత పర్యటనల్లో అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌లో అద్భుతంగా రాణించాడు.
ఇదే సమయంలో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ అతడు రాణించాడు. ఈ క్రమంలో ఒక్కో స్థానానికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉండడంతో జట్టు సెలక్షన్ ఇప్పుడు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్‌లో చాలా మంది ఆటగాళ్లు ఉండడంతో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌లకు చోటు దక్కడం కష్టమనే చెప్పాలి.
అటు వన్డేల్లో ప్రధాన వికెట్ కీపర్‌గా ఉన్నకేఎల్ రాహుల్ కు కూడా చోటు కష్టంగానే ఉంది. ప్రధాన వికెట్ కీపర్‌గా శాంసన్ ఎలాగో ఉండనే ఉన్నాడు. ఇక ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మలలో ఒకరికి రెండో కీపర్‌గా అవకాశం దక్కొచ్చు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. అతడు ఇంకా ఈ గాయం నుంచి కోలుకోలేదు. దీంతో అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనే అవకాశాలు లేవు.
Womens Odi WC 2025 : వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఇంకో 50 రోజులే..
స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు ఖాయమే. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. పేస్ విభాగంలో బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌లను ఎంపిక చేయొచ్చు. మూడో పేసర్ కావాలనుకుంటే ప్రసిద్ధ్ కృష్, హర్షిత్ రాణాలలో ఒకరికి చోటు దక్కొచ్చు.