Team India star player Shreyas Iyer creates history in nagpur odi
ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. దాదాపు ఆరు నెలల తరువాత వన్డే జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
మొత్తంగా 36 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అయ్యర్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో స్థానంలో బరిలోకి దిగి 50 ఫ్లస్ సగటుతో 100 కన్నా ఎక్కువ స్ట్రైక్‌రేటుతో 1000కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు వన్డేల్లో ఈస్థానంలో మరే క్రికెటర్ కూడా ఇలాంటి ఘనత అందుకోలేదు.
SAT20 : మార్‌క్రమ్ మామనా.. మజాకానా.. ఆనందంలో కాప్య పాప.. ముచ్చటగా మూడోసారి..
అయితే.. వేరే వేరే స్థానాల్లో మాత్రం పలువురు క్రికెటర్లు ఈ ఫీట్‌ను నమోదు చేశారు. టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్ ఓపెనర్‌గా, ఏబీ డివిలియర్స్(ఐదో స్ధానం) ఈ ఘనతను సాధించారు.
నేనసలు ఈ మ్యాచ్ ఆడాల్సింది కాదు..
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ తుది జట్టులో తనకు స్థానం లేదన్నాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌గా లేకపోవడంతోనే తనకు అవకాశం వచ్చిందన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి తాను మొబైలో మూవీ చూస్తుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫోన్ చేసినట్లుగా చెప్పాడు. కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. రేపటి మ్యాచ్‌లో నువ్వు ఆడే ఛాన్స్ ఉంది రెడీ ఉంమని హిట్‌మ్యాన్ చెప్పినట్లు వివరించాడు. దీంతో వెంటనే తాను మొబైల్ ఆఫ్ చేసి పడుకుండిపోయినట్లుగా అయ్యర్ తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51), ఫిలిప్ సాల్ట్ (43)లు రాణించడంతో 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు చెరో మూడు వికెట్లు, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. శుభ్‌మన్ గిల్ (87; 96 బంతుల్లో 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అక్షర్ పటేల్ (52; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు చెలరేగి ఆడారు.