SAT20 : మార్‌క్రమ్ మామనా.. మజాకానా.. ఆనందంలో కావ్య పాప.. ముచ్చటగా మూడోసారి..
సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో అదరగొడుతోంది.

Sunrisers Eastern Cape enter in to final for third time in SA T20
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ అదరగొడుతోంది. గురువారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌ను 8 వికెట్లతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఫైనల్ చేరుకోవడం ఇది వరుసగా మూడో సారి.
క్వాలిఫయర్-2లో భాగంగా సెంచూరియన్ వేదికగా పార్ల్ రాయల్స్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాయల్స్ బ్యాటర్లలో రూబిన్ హెర్మాన్ (81 నాటౌట్; 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), లువాన్-డ్రే ప్రిటోరియస్ (59; 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు.
Hardik Pandya : టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా? అన్యాయం తరువాత.. !
– Champions in 2023.
– Champions in 2024.
– Qualified for the finals in 2025*.THE ORANGE ARMY OF MARKRAM IN SA20 – It’s Sunrisers Eastern Cape 🧡 pic.twitter.com/abZGqfGt2z
— Johns. (@CricCrazyJohns) February 6, 2025
కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (6), దినేశ్ కార్తీక్(2) లు విఫలం కాగా.. ఆఖరిలో ఫెహ్లుక్వాయో (22 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఓవర్టన్, మార్కో జానెసన్, బార్టమన్, మార్‌క్రమ్ తలా వికెట్ తీశారు.
అనంతరం టోనీ డి జోర్జి (78; 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డాన్ హెర్మాన్ (69 నాటౌట్; 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే చెరో వికెట్ తీశారు.
వరుసగా మూడో సారి..
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2023లో ప్రారంభమైంది. ఇది మూడో సీజన్. తొలి రెండు సీజన్లలో ఐడిన్ మార్‌క్రమ్ నేతృత్వలోని సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు రాయల్స్ ఓడించి వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇది ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి చెందిన టీమ్ కావడం విశేషం. 2016లో ఐపీఎల్ లో సన్‌రైజర్స్ కప్ అందుకోగా నాటి నుంచి కప్ కోసం ఎదురుచూస్తోంది. అయితే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా మూడో సారి కప్‌ను అందుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది.
ఫైనల్ మ్యాచ్ శనివారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో కప్ కోసం సన్‌రైజర్స్ ఎంఐ కేప్‌టౌన్‌తో తలపడనుంది.