Virat Kohli : క్రికెట్‌లో కోహ్లికి ఏ ఫార్మాట్ అంటే ఇష్ట‌మో మీకు తెలుసా..?

టెస్టులు, వ‌న్డేలు, టీ20లు ప్ర‌స్తుతం క్రికెట్ ఆట‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఫార్మాట్లు. వీటిలో ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఏ ఫార్మాట్ అంటే ఇష్ట‌మో మీకు తెలుసా..?

Virat Kohli loves ODIs

Virat Kohli loves ODIs : టెస్టులు, వ‌న్డేలు, టీ20లు ప్ర‌స్తుతం క్రికెట్ ఆట‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఫార్మాట్లు. వీటిలో ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఏ ఫార్మాట్ అంటే ఇష్ట‌మో మీకు తెలుసా..? ఈ మూడు ఫార్మాట్ల‌లో త‌న‌కు వ‌న్డేలు అంటేనే చాలా ఇష్టం అంటూ విరాట్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఓ ఆట‌గాడి సత్తాకు వ‌న్డేలే అస‌లు సిస‌లు ప‌రీక్ష పెడుతాయ‌న్నాడు. రేప‌టి (ఆగ‌స్టు 30 బుధ‌వారం) నుంచి ఆసియా క‌ప్ (Asia cup) ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఓ క్రీడా ఛాన‌ల్‌తో మాట్లాడుతూ కోహ్లి ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

స‌వాళ్లు అంటే ఇష్ట‌ప‌డే త‌న‌కు వ‌న్డే ఫార్మాట్ ఇష్టం అని కోహ్లి చెప్పాడు. త‌న దృష్టిలో వ‌న్డే క్రికెట్ ఓ ఆట‌గాడి స‌త్తాకు అన్ని విధాలా ప‌రీక్ష పెడుతుంద‌న్నాడు. బ్యాట‌ర్‌ టెక్నిక్, కంపోజర్‌తో పాటు ఓపికను పరీక్షిస్తద‌ని, ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఆట‌ను మార్చుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపాడు. ఇవ‌న్నీ ఓ బ్యాట‌ర్‌ను పూర్తి స్థాయిలో టెస్టు చేస్తాయ‌న్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న‌లోని అత్యుత్త‌మ ఆట బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చాడు.

BWF rankings : కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. సింధు ర్యాంక్ ఎంతంటే..?

వన్డేల్లో తాను ఎప్పుడు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఆడుతూ జ‌ట్టును గెలిపించేందుకు ఇష్ట‌ప‌డుతుంటాన‌ని అన్నాడు. ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాల‌నే కోరిక ఫ్యాన్స్ కంటే ఎక్కువ‌గా ఆట‌గాళ్ల‌కే ఉంటుంద‌ని పేర్కొన్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడేందుకు ప్లేయ‌ర్లు అంద‌రూ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు చెప్పాడు. సాధార‌ణంగా మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉంటుంద‌ని, దాన్ని అధిగ‌మించ‌డ‌మే కీల‌క మ‌న్నాడు. ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు కోహ్లి చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 275 వ‌న్డే మ్యాచులు ఆడాడు. 57.32 స‌గ‌టుతో 12,898 ప‌రుగులు చేశాడు. అత‌డి ఖాతాలో 46 శ‌త‌కాలు, 65 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఈ 46 సెంచ‌రీల్లో 26 శ‌త‌కాలు ఛేజింగ్‌లో చేసిన‌వే కావ‌డం విశేషం. రెండు, మూడేళ్లు ఫామ్ లేక తంటాలు ప‌డ్డ కోహ్లి గ‌తేడాది ఆసియాక‌ప్‌తో ఫామ్ అందుకున్నాడు. అదే జోరును కొన‌సాగిస్తూ ఈ సారి కూడా ప‌రుగుల వ‌ర‌ద పారించాల‌ని చూస్తున్నాడు.

Virat Kohli : మ‌ళ్లీ చెబుతున్నా.. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ.. కోహ్లితో వ‌ద్దు.. బౌల‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌