Team India white ball tour of Bangladesh rescheduled to September 2026
BAN vs IND : బంగ్లాదేశ్‌లో టీమ్ఇండియా పర్యటన ఖరారైంది. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నెలలో టీమ్ఇండియా బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది.
వాస్తవానికి ఈ పర్యటన గత ఏడాది (2025) ఆగస్టులోనే ఉండాల్సి ఉంది. అయితే.. అప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆ దేశంలో అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలోనే సిరీస్‌ను ఈ ఏడాదికి వాయిదా వేశారు.
Shubman gill : శుభ్‌మన్ గిల్ రీ ఎంట్రీ డేట్ ఫిక్స్.. మైదానంలో అడుగుపెట్టేది ఆ రోజే..
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఏడాది బంగ్లాదేశ్ క్రికెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పాకిస్తాన్, న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను వెల్లడించింది.
The Bangladesh Cricket Board has announced the itinerary for the white-ball series against India
ODIs: September 1, 3, 6
T20Is: September 9, 12, 13 #2026CricketCalendar pic.twitter.com/CIDvTZo5eC— Cricbuzz (@cricbuzz) January 2, 2026
గతేడాది ఆగస్టులో (BAN vs IND) వాయిదా పడిన భారత్, బంగ్లాదేశ్ వైట్‌బాల్ సిరీస్‌ల తేదీలను రీ షెడ్యూల్ చేసినట్లు బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చీఫ్ షహరీర్ నఫీజ్ తెలిపారు.
Ashes : గెలుపు జోష్‌లో ఐదో టెస్టుకు రెండు రోజుల ముందుగానే ఇంగ్లాండ్.. వామ్మో ఏం ప్లానింగ్ గురూ!
వైట్ సిరీస్‌ల కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేకు వెళ్లనుంది. తొలుత వన్డే సిరీస్, ఆ తరువాత టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జరగనుండగా, టీ20 సిరీస్ సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు జరగనుంది.
భారత్, బంగ్లాదేశ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే మ్యాచ్- సెప్టెంబర్ 1న
* రెండో వన్డే మ్యాచ్ – సెప్టెంబర్ 3న
* మూడో వన్డే మ్యాచ్ – సెప్టెంబర్ 6న
భారత్, బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 9న
* రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 12న
* మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 13న