Shubman gill : శుభ్‌మన్ గిల్ రీ ఎంట్రీ డేట్ ఫిక్స్.. మైదానంలో అడుగుపెట్టేది ఆ రోజే..
టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman gill) మళ్ళీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
Shubman gill will be playing for Punjab tomorrow in Vijay Hazare Trophy
- గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్..
- కివీస్‌తో వన్డే సిరీస్ కన్నా ముందుగానే మైదానంలోకి
- విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరుపున బరిలోకి
Shubman gill : టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్ళీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతడు న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కన్నా ముందుగానే మ్యాచ్‌లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరుపున అతడు బరిలోకి దిగనున్నాడు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గిల్ (Shubman gill) పాల్గొన్నాడు. అయితే.. మూడో టీ20 మ్యాచ్ అనంతరం గాయం కావడంతో ఆఖరి రెండు టీ20 మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గాయం నుంచి కోలుకున్న అతడు ఫామ్ అందుకునేందుకు విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు.
Ashes : గెలుపు జోష్‌లో ఐదో టెస్టుకు రెండు రోజుల ముందుగానే ఇంగ్లాండ్.. వామ్మో ఏం ప్లానింగ్ గురూ!
శనివారం (జనవరి 3న) సిక్కింతో జరిగే మ్యాచ్‌లో గిల్ పంజాబ్ తరుపున ఆడనున్నాడు. ఆ తరువాత జనవరి 6న గోవాతో జరిగే మ్యాచ్‌లోనూ అతడు బరిలోకి దిగనున్నాడు. రెండు మ్యాచ్‌లు కూడా జైపూర్ వేదికగానే జరగనున్నాయి. కాగా.. ఈ రెండు మ్యాచ్‌ల అనంతరం గిల్ కివీస్‌తో వన్డే సిరీస్ కోసం సిద్ధం కానున్నాడు.
వాస్తవానికి విజయ్ హజారే ట్రోఫీ కోసం పంజాబ్ ప్రకటించిన జట్టులో శుభ్‌మన్ గిల్ పేరు ఉంది. అయితే.. గాయం కారణంగా అతడు తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడలేదు.
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే మ్యాచ్ – జనవరి 11 (వడోదర)
* రెండో వన్డే మ్యాచ్ – జనవరి 14 (రాజ్ కోట్)
* మూడో వన్డే మ్యాచ్ – జనవరి 18 (ఇండోర్)
