Premier Handball League: తెలుగు టాల‌న్స్ జెర్సీ ఆవిష్క‌ర‌ణ‌.. కెప్టెన్ ఎవ‌రంటే..?

ప్రీమియ‌ర్ హ్యాండ్ బాల్ లీగ్(PHL) మొద‌టి సీజ‌న్ జూన్ 8 నుంచి ఆరంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ లీగ్‌లో తెలుగు టాలన్స్(Telugu Talons) జ‌ట్టు తెలుగు ప్ర‌జ‌ల త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తోంది.

Premier Handball League-Telugu Talons: ప్రీమియ‌ర్ హ్యాండ్ బాల్ లీగ్(PHL) మొద‌టి సీజ‌న్ జూన్ 8 నుంచి ఆరంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ లీగ్‌లో తెలుగు టాలన్స్(Telugu Talons) జ‌ట్టు తెలుగు ప్ర‌జ‌ల త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్ టీయూహెచ్‌)లోని ఇండోర్‌ స్టేడియంలో సోమ‌వారం తెలుగు టాల‌న్స్ జ‌ట్టు యొక్క జెర్సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. తెలంగాణ పరిశ్రమలు-వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్, జేఎన్‌టీయూహెచ్‌ వైస్‌–ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.నరసింహా రెడ్డి పాల్గొని కొత్త జెర్సీని ఆవిష్క‌రించారు.

మొద‌టి సీజ‌న్ తెలుగు టాలన్స్ కెప్టెన్‌గా ‘శుభమ్‌ షియోరాన్ ’ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా జట్టు యజమాని అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సీజన్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఏ23, అసోసియేట్‌ స్పాన్సర్‌గా ప్యారడైజ్ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు. జేఎన్ టీయూ, ఆక్సిలోన్స్, మల్లా రెడ్డి యూనివర్సిటీ, యాడ్‌ ప్రకాష్‌ ప్రాజెక్ట్స్‌ లు ఇతర అసోసియేట్‌ స్పాన్సర్లుగా కొనసాగనున్నారని, కొత్త టీం, స్పాన్సర్లతో ఈ సీజన్‌లో ఉత్సాహాంగా పాల్గొనడానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపారు.

Premier Handball League: జూన్ 8 నుంచి ప్రారంభం.. 6 జ‌ట్లు.. 18 రోజులు.. 33 మ్యాచులు

అనంత‌రం టాల‌న్స్ కోచ్‌ ‘ఫెర్నాండో న్యూస్‌’ మాట్టాడుతూ.. ‘శుభమ్‌ షియోరాన్ ’ ఆటలో అపారమైన అనుభవమున్న క్రీడాకారుడని తెలిపారు. అంతేకాకుండా మంచి వ్యూహకర్త అని, అంద‌రితో క‌లిసిపోయి వ్యూహాల‌ను స‌రిగ్గా అమ‌లు చేసి విజ‌యాల‌ను తీసుకొస్తాడ‌ని బావిస్తున్న‌ట్లు చెప్పాడు. అత‌డిలో నాయకత్వ లక్షణాల‌ను చూసే కెప్టెన్ గా ఎంచుకున్నట్లు చెప్పాడు. అనంత‌రం ఎగ్జిబిష‌న్ మ్యాచ్ ను నిర్వ‌హించారు.

ట్రెండింగ్ వార్తలు