Premier Handball League: జూన్ 8 నుంచి ప్రారంభం.. 6 జ‌ట్లు.. 18 రోజులు.. 33 మ్యాచులు

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ జూన్ 8 నుంచి ఆరంభం కానుంది. 18 రోజుల పాటు అభిమానుల‌ను అల‌రించ‌నున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జ‌ట్లు పాల్గొన‌నుండ‌గా 33 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి.

Premier Handball League: జూన్ 8 నుంచి ప్రారంభం.. 6 జ‌ట్లు.. 18 రోజులు.. 33 మ్యాచులు

Premier Handball League

Premier Handball Leagu inaugural season: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ జూన్ 8 నుంచి ఆరంభం కానుంది. 18 రోజుల పాటు అభిమానుల‌ను అల‌రించ‌నున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జ‌ట్లు పాల్గొన‌నుండ‌గా 33 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (PHL) ఆధ్వర్యంలో ఇది ఆరంభం సీజ‌న్‌. రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో గ్రూప్ స్టేజ్ లో 30 మ్యాచ్‌లు జ‌ర‌గుతాయి. అనంత‌రం విజేత‌ను నిర్ణ‌యించేందుకు ప్ర‌త్యేకంగా మూడు నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి.

గ్రూప్ స్టేజ్‌లో ప్ర‌తీ జ‌ట్టు క‌నీసం 10 మ్యాచ్‌ల‌ను ఆడ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఈ మ్యాచ్‌లు అన్ని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి. ఒక్కో జట్టులో 17 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో 14 మంది భారతీయ ఆటగాళ్లతో పాటు మరో ముగ్గురు విదేశీయులు ఉంటారు.

MS Dhoni: శుభ‌వార్త‌.. ధోని మోకాలి ఆపరేషన్‌ సక్సెస్‌

లీగ్‌లో ఆడే జ‌ట్లు ఇవే

1.రాజస్థాన్ పేట్రియాట్స్, 2.గర్విట్ గుజరాత్, 3.మహారాష్ట్ర ఐరన్‌మెన్, 4.గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్, 5.ఢిల్లీ పంజర్స్, 6.తెలుగు టాలోన్స్.

జూన్ 8న రాజస్థాన్ పేట్రియాట్స్, మహారాష్ట్ర ఐరన్‌మెన్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి మ్యాచుతో ఈ మొద‌టి సీజ‌న్ ఆరంభం కానుంది. ప్ర‌తీ రోజు రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొద‌టి మ్యాచ్ రాత్రి 7 గంట‌ల‌కు ఆరంభం కానుండ‌గా, రెండో మ్యాచ్ రాత్రి 8.30 మొద‌లుకానుంది. ఈ మ్యాచ్‌ల‌ను వయాకామ్‌18 (Viacom18), జియో సినిమా (JioCinema), స్పోర్ట్స్ 18-1 (HD & SD), స్పోర్ట్స్ 18 ఖేల్‌లో చూడొచ్చు.

Global Chess League: చెస్ క్రీడా ప్ర‌పంచంలో ఉన్న అంత‌రాల‌ను తొల‌గించేందుకు.. గ్లోబ‌ల్ చెస్ లీగ్ వ‌చ్చేస్తుంది

లీగ్‌ షెడ్యూల్ విడుదల సంద‌ర్భంగా బ్లూ స్పోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అభినవ్ బంతియా మాట్లాడుతూ.. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులలో తాను ఒకడిని చెప్పారు. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహాం మరింత ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. మ్యాచ్‌లు జరిగే సమయంలో హై-ఆక్టేన్ డిస్‌ప్లేలు ప్రేక్షకులను అలరిస్తాయని, తమ ప్రయత్నం దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని ఆశిస్తుస్తున్న‌ట్లు అభినవ్ బంతియా అన్నారు.