ISPL : మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్.. ఇలా న‌మోదు చేసుకోండి

Indian street premier league : టీ10 టెన్నిస్ బాల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్‌) ఆరంభ సీజ‌న్ 2024 మార్చి 2 నుంచి ఆరంభం కానుంది.

Indian street premier league

టీ10 టెన్నిస్ బాల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్‌) ఆరంభ సీజ‌న్ 2024 మార్చి 2 నుంచి ఆరంభం కానుంది. మార్చి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు పాల్గొంటాయి. మొత్తం 19 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. క్రికెట్ థ్రిల్‌ను వీధుల నుంచి స్టేడియం వరకు తీసుకురావడానికి సీసీఎస్ స్పోర్ట్స్ ఎల్ఎల్‌పీ దేశంలో మొట్ట‌మొద‌టి సారిగా ఈ టోర్నీకి శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), శ్రీనగర్ (జమ్మూ, జమ్మూ- కాశ్మీర్) జ‌ట్లు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో భాగ‌స్వామ్యం కానున్నాయి. త‌మ క‌ల‌ల స్టేడియంలో క్రికెట్ ఆడాల‌నుకునే ఎంతో మంది ప్ర‌తిభావంతుల క‌ల‌ను నిజం చేయ‌డం, స్ట్రీట్ – స్టేడియం మధ్య అంతరాన్ని తగ్గించాలనేది ఈ లీగ్ ల‌క్ష్యంగా చెబుతున్నారు. ఆట‌గాళ్లు త‌మ నైపుణ్యాల‌ను మెరుగుప‌రుచుకునేందుకు ఇది ఓ వేదిక కానుంది.

బీసీసీఐ కోశాధికారి, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కోర్ కమిటీ సభ్యుడు ఆశిష్ షెలార్ మాట్లాడుతూ.. ఐఎస్ పీఎల్ కేవలం ఒక టోర్నమెంట్ కాదన్నారు. ఇందులో పాల్గొనే వారు డైనమిక్ టీ10 ఫార్మాట్‌లో పోటీపడటమే కాకుండా అనుభవజ్ఞులైన రంజీ ట్రోఫీ ఆటగాళ్ల నుంచి అమూల్యమైన స‌ల‌హాల‌ను కూడా అందుకోవ‌చ్చున‌న్నారు. ఈ మెంటర్‌షిప్ అవకాశం ఆటగాళ్ళలో నైపుణ్యాలను, ఆటపై అవగాహన పెంచడం, క్రికెట్ ప్రపంచంలో వారి భవిష్యత్తు విజయానికి మార్గాన్ని సృష్టించనుంద‌ని చెప్పారు.

Dog Attacks Bowler : బౌల‌ర్ వెంట ప‌డిన కుక్క‌.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..? వీడియో

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ చీఫ్ మెంటర్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది త‌మ క్రికెట్ కలలను పెద్ద వేదికపై నిజం చేసుకునే అవకాశాన్ని ల‌భిస్తుంద‌న్నారు. ఈ టోర్నమెంట్ నుంచి వెలుగులోకి రాబోతున్న విజయగాథలను చూడటానికి తాను ఎంత‌గానో ఎదురుచూస్తున్న‌ట్లు ర‌విశాస్త్రి చెప్పుకొచ్చారు.

ICC Champions Trophy 2025 : పాకిస్తాన్‌కు భారీ షాక్‌..? దుబాయ్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ..!

ఈ టోర్నీ లో పాల్గొనడానికి ఆటగాళ్లు 20 డిసెంబరు 2023లోపు www.ispl-t10.com వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. భారత క్రికెట్‌లో కొత్త శకం ఆవిర్భవించడాన్ని చూసేందుకు అభిమానులు, ఆటగాళ్లు, క్రికెట్ ఔత్సాహికులు అందరూ ఆహ్వానితులేన‌ని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు