Dog Attacks Bowler : బౌల‌ర్ వెంట ప‌డిన కుక్క‌.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..? వీడియో

Dog Attacks : ప్ర‌పంచంలో ఏ మూలన ఏది జ‌రిగినా కూడా సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని తెలిసిపోతుంది

Dog Attacks Bowler : బౌల‌ర్ వెంట ప‌డిన కుక్క‌.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?  వీడియో

Dog Attacks Bowler

ప్ర‌పంచంలో ఏ మూలన ఏది జ‌రిగినా కూడా సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని తెలిసిపోతుంది. కొన్ని వీడియోలు చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు. క్రికెట్ కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఓ ఫాస్ట్ బౌల‌ర్ బంతిని వేస్తుండ‌గా అత‌డి వెంట కుక్క ప‌డింది. దీంతో ర‌న్న‌ప్‌ను మ‌ధ్య‌లోనే ఆపేసిన అత‌డు కుక్క నుంచి త‌న‌ను ర‌క్షించుకునేందుకు కుక్క వైపు బంతిని విసిరేశాడు. ఈ ఘ‌ట‌న ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగిందో అన్న విష‌యాలు తెలియ‌రాలేదు. చూస్తుంటే ఏదో గ‌ల్లీ మ్యాచ్‌లా క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ విష‌యానికి వ‌స్తే.. టీమ్ఇండియా ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. ఆదివారం తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచులోనూ భార‌త్ 44 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 235 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఆఖ‌ర్లో రింకూ సింగ్ (31 నాటౌట్‌; 9 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్స‌ర్లు) వేగంగా బ్యాటింగ్ చేశాడు.

ICC Champions Trophy 2025 : పాకిస్తాన్‌కు భారీ షాక్‌..? దుబాయ్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ..!

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల కోల్పోయి 191 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. మార్క‌స్ స్టోయినిస్ (45), మాథ్యూవేడ్ (42 నాటౌట్‌), టిమ్ డేవిడ్ (37) లు ఓ మోస్త‌రుగా రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విబిష్ణోయ్, ప్ర‌సిద్ధ్ కృష్ణ లు చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, ముకేశ్ కుమార్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో భార‌త్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

రోహిత్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన జైస్వాల్‌..

ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 24 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కం సాధించాడు. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగులు చేశాడు.ఈ క్ర‌మంలో టీ20ల్లో ప‌వ‌ర్ ప్లేలో టీమ్ఇండియా త‌రుపున‌ అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల రికార్డులు బ్రేక్ చేశాడు. 2021లో స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (50 ప‌రుగులు), న్యూజిలాండ్‌తో 2020లో జ‌రిగిన మ్యాచులో రోహిత్ శ‌ర్మ (50 నాటౌట్ )లు అర్ధ‌శ‌త‌కాలు చేశారు. తాజాగా 53 ప‌రుగుల‌తో జైస్వాల్ వీరి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.

Yashasvi Jaiswal : అది ముమ్మాటికీ నా త‌ప్పే.. అందుకే క్ష‌మాప‌ణ‌లు చెప్పా : య‌శ‌స్వి జైస్వాల్‌