The Hundred 2025 Jos Buttler joins MS Dhoni Dinesh Karthik in elite list
Jos Buttler : ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. వికెట్ కీపర్‌గా 200 క్యాచ్‌లు అందుకున్న జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ది హండ్రెడ్ 2025 సీజన్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ కు బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అతడు నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు.
క్వింటన్ డికాక్, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌కు గుడ్‌బై..
టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్లు..
* క్వింటన్ డికాక్ – 263 క్యాచ్‌లు
* ఎంఎస్ ధోని – 225 క్యాచ్‌లు
* దినేశ్ కార్తీక్ – 216 క్యాచ్‌లు
* జోస్ బట్లర్ – 200 క్యాచ్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. నార్తర్న్ బ్యాటర్లలో సమిత్ పటేల్ (19 బంతుల్లో 42 పరుగులు), డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 30 పరుగులు) లు రాణించారు. మాంచెస్టర్ బౌలర్లలో థామస్ ఆస్పిన్‌వాల్ మూడు వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్, జోష్ టంగ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్కాట్ క్యూరీ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 140 పరుగుల లక్ష్యాన్ని మాంచెస్టర్ 84 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. మాంచెస్టర్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (70; 37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. రచిన్ రవీంద్ర (47 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టాడు. నార్తర్న్ బౌలర్లలో జాకబ్ డఫీ, టామ్ లాస్, ఆదిల్ రషీద్ లు తలా ఓ వికెట్ తీశారు.