Deepti Sharma : దీప్తిశ‌ర్మ సిక్స‌ర్‌.. లండ‌న్ స్పిరిట్ డ‌గౌట్‌లో రియాక్ష‌న్ చూశారా..? భార‌త బ్యాట‌రా మ‌జాకానా..!

మ‌హిళ‌ల ది హండ్రెడ్ టోర్నీ విజేత‌గా లండ‌న్ స్పిరిట్ నిలిచింది.

The reaction of London Spirit dugout when Deepti Sharma smashed the six video viral

Deepti Sharma six : మ‌హిళ‌ల ‘ది హండ్రెడ్’ టోర్నీ విజేత‌గా లండ‌న్ స్పిరిట్ నిలిచింది. ఫైన‌ల్‌లో వెల్ష్ ఫైర్ జ‌ట్టు పై విజ‌యాన్ని అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠ సాగిన ఫైన‌ల్ మ్యాచులో భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ సిక్స‌ర్‌తో లండ‌న్ స్పిరిట్ కు విజ‌యాన్ని అందించింది. దీంతో లండ‌న్ స్పిరిట్ జ‌ట్టు తొలిసారి హండ్రెడ్ ట్రోఫీని ముద్దాడింది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ వెల్ ఫైర్ జ‌ట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. వెల్ పైర్ బ్యాట‌ర్ల‌లో జెస్ జొనాసెస్ (41 బంతుల్లో 8 ఫోర్లతో 54 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీ బాదింది. టామీ బీమోంట్ (16 బంతుల్లో 21), హీలీ మాథ్యూస్ (26 బంతుల్లో 22) లు రాణించారు. లండ‌న్ స్పిరిట్ బౌల‌ర్ల‌లో ఇవా గ్రే, సారా గ్లెన్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా, దీప్తి శ‌ర్మ‌, తారా నోరిస్‌ల‌కు ఒక్కొ వికెట్ ల‌భించింది.

Rishabh Pant : సరికొత్త అవ‌తారం ఎత్తిన పంత్‌.. నీలో ఈ క‌ళ కూడా ఉందా..? బ్యాట‌ర్ల‌కు చుక్క‌లే..

అనంత‌రం జార్జియా రెడ్మెన్‌ (32 బంతుల్లో 34), హీతెర్‌ నైట్‌ (18 బంతుల్లో 24), డానియెలా గిబ్సన్‌ (9 బంతుల్లో 22) రాణించ‌డంతో లండ‌న్ స్పిరిట్ జ‌ట్టు 98 బంతుల్లో 6 వికెట్లు విజ‌యాన్ని అందుకుంది. వెల్ష్ ఫైర్‌ జట్టు బౌలర్లలో షబ్నిమ్‌ మూడు వికెట్లు తీసింది.

దీప్తి సిక్స‌ర్‌.. డ‌గౌట్ ఎమోష‌న్‌..

ఈ మ్యాచ్‌లో దీప్తి శ‌ర్మ ఆఖ‌రిలో కీల‌క ఇన్నింగ్స్ ఆడింది. 16 బంతుల‌ను ఎదుర్కొని ఓ సిక్స్ బాది 16 ప‌రుగులు చేసింది. లండ‌న్ స్పిరిట్ విజ‌యానికి ఆఖ‌రి 5 బంతుల్లో 6 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. విండీస్ ఆల్‌రౌండ‌ర్‌ హీలీ మాథ్యూస్ ఆఖ‌రి 5 బంతుల‌ను వేయ‌డానికి వ‌చ్చింది. తొలి బంతికి దీప్తి, రెండో బంతికి చార్లీ డీన్ లు సింగిల్‌లు తీశారు. దీంతో విజ‌య‌స‌మీక‌ర‌ణం 3 బంతుల్లో 4 ప‌రుగులుగా మారింది. ఈ ద‌శ‌లో హీలీ వేసిన మూడో బంతిని దీప్తి శ‌ర్మ భారీ సిక్స‌ర్‌గా మ‌లిచింది. దీప్తి సిక్స్ కొట్టిన‌ప్పుడు లండ‌న్ స్పిరిట్ డ‌గౌట్ కు సంబంధించిన ఎమోష‌న్ మూమెంట్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Pat Cummins : టీమ్ఇండియాతో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా కెప్టెన్ క‌మిన్స్ కీల‌క నిర్ణ‌యం

ట్రెండింగ్ వార్తలు