Champions Trophy: అందుకే టీమిండియా ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవబోతుంది: టీమిండియా మాజీ క్రికెటర్

న్యూజిలాండ్‌ను టీమిండియా తక్కువగా తీసుకోవద్దని అన్నారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భారత్‌ ఆడుతున్న తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా ఆటతీరు చూస్తుంటే ప్రత్యర్థి జట్టుపై ఏ మాత్రం జాలిలేకుండా ఆడుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు. టీమిండియా ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగ్గా ఆడుతోందని తెలిపారు. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రమూ ఛాన్స్ ఇవ్వట్లేదని అన్నారు.

Former India cricketer Lalchand Rajput

ఇకపై కూడా అంతే అగ్రెసివ్‌గా ఆడాలని లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ చెప్పారు. ప్రస్తుతం కనబర్చుతున్న ఆటతీరుతో తప్పకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని భావిస్తున్నానని తెలిపారు. పాకిస్థాన్‌పై శతకంతో కోహ్లి మళ్లీ ఫాంలోకి వచ్చాడని చెప్పారు. ఇక రోహిత్ శర్మ కూడా శతకం బాదితే టీమిండియాకు తిరుగుండదని అన్నారు.

Also Read: బంగారం మరో నాలుగు నెలల తర్వాత అక్కడ తగ్గుతుందా? 50 ఏళ్ల నుంచి ట్రెండ్‌ ఇలాగే ఉంది మరి..

ఛాంపియన్స్‌ ట్రోఫీ వంటి వాటిలో మంచి ఆటతీరు ప్రదర్శించడం ప్రశంసనీయమని లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ చెప్పారు. న్యూజిలాండ్‌ను టీమిండియా తక్కువగా తీసుకోవద్దని అన్నారు. ప్రతి మ్యాచు కూడా ముఖ్యమేనని తెలిపారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌తో టీమిండియా తేలికగా గెలిచిందని, ఇకపై కూడా అలాగే ఆడాలని చెప్పారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్‌ ఏలో టాప్‌లో ఉన్న న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య మార్చి 2న మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. గ్రూప్ దశలో జరిగే చివరి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే గ్రూప్‌ ఏలో టాప్‌కు వెళ్తుంది. మనం గెలిస్తే గ్రూప్‌ బీలో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న జట్టుతో సెమీఫైనల్‌లో ఆడాల్సి ఉంటుంది.

గ్రూప్ బీలో అన్ని మ్యాచ్‌లు పూర్తయిన అనంతరం టీమిండియా, న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడే జట్లు ఏవన్న విషయాన్ని చెప్పవచ్చు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా గ్రూప్‌ బీలో అగ్రస్థానంలో ఉండే ఛాన్సులు కనపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.