×
Ad

Tilak Varma : తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు.. 15మంది సభ్యులతో జట్టు ప్రకటన

Tilak Varma : టీమిండియా ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.

Tilak Varma

Tilak Varma : టీమిండియా ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆసియాకప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై అద్భుత బ్యాటింగ్‌తో తిలక్ వర్మ టీమిండియాకు విజయాన్ని అందించాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ జట్టును ఆసియాకప్ టోర్నీ విజేతగా నిలిపాడు. తిలక్ వర్మ ఆటతీరు పట్ల మాజీ క్రికెటర్లతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు.

కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా -ఎ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 122 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 94 పరుగులు చేశాడు. అద్భుత ఫామ్ తో పరుగుల వరద పారిస్తున్న తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి.

Also Read: Shubman Gill : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. అరుదైన ఘ‌న‌త‌పై గిల్ క‌న్ను.. ప్ర‌పంచ క్రికెట్‌లో తొలి ఆట‌గాడిగా నిలిచే ఛాన్స్‌..

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ నడిపించనున్నాడు. ఢిల్లీతో అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సెలక్షన్ కమిటీ బుధవారం 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలకు రాహుల్ సింగ్ ఎంపికయ్యాడు.

ఇదిలాఉంటే.. త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో వర్మ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఆడబోయే తొలి మ్యాచ్ కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 15-18 మధ్యలో ఢిల్లీతో ఆడుతుంది. అనంతరం రెండో మ్యాచ్‌ (పుదుచ్చేరి) అక్టోబర్‌ 25 నుంచి ప్రారంభమవుతుంది. తిలక్‌ వర్మ తొలి మ్యాచ్‌ ముగిసిన వెంటనే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియాకు బయల్దేరతాడు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 29న జరగనుంది.

హైదరాబాద్ రంజీ జట్టు..
తిలక్ వర్మ(కెప్టెన్), రాహుల్ సింగ్(వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ఆటగాళ్లు ..
పి. నితీష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్.