Shubman Gill : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. అరుదైన ఘనతపై గిల్ కన్ను.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా నిలిచే ఛాన్స్..
వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Shubman Gill Needs 196 Runs To Become First Player 1000 runs in wtc 2027
Shubman Gill : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ 10 (శుక్రవారం) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక గిల్ 196 పరుగులు సాధిస్తే అప్పుడు డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ఇప్పటి వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్‌లో గిల్ 6 టెస్టులు ఆడాడు. 804 పరుగులు సాధించాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్ కొనసాగుతున్నాడు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జో రూట్ ఉన్నారు.
Yashasvi Jaiswal : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించే అవకాశం..
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* శుభ్‌మన్ గిల్ (భారత్)- 6 మ్యాచ్‌ల్లో 804 పరుగులు
* కేఎల్ రాహుల్ (భారత్) – 6 మ్యాచ్‌ల్లో 632 పరుగులు
* రవీంద్ర జడేజా (భారత్) – 6 మ్యాచ్‌ల్లో 620 పరుగులు
* జోరూట్ (ఇంగ్లాండ్)- 5 మ్యాచ్‌ల్లో 537 పరుగులు
* హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 5 మ్యాచ్‌ల్లో 481 పరుగులు
వెస్టిండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.