Tilak Varma said after the game I realised that Ive finished 72 and my Jersey number is also 72
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు వరుసగా రెండో మ్యాచులోనూ విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అసాధారణ ఇన్నింగ్స్‌తో భారత్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా మరో నాలుగు బంతులు మిగిలిన ఉండగానే ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం తిలక్ వర్మ (72; 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి భారత్‌ను గెలిపించాడు. ఇక మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు.
IND vs ENG 2nd T20 : రెండో టీ20లో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ కీలక వ్యాఖ్యలు..
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 72 పరుగులు చేశాడు. కాగా.. అతడి జెర్సీ నంబర్ కూడా 72 కావడం విశేషం. “ఈ మ్యాచ్‌లో నేను చేసిన పరుగులు 72 కాగా.. నా జెర్సీ నంబర్ కూడా 72 అనే విషయాన్ని మ్యాచ్ అనంతరం గమనించాను.” అని తిలక్ వర్మ చెప్పాడు. కాగా.. మ్యాచ్‌కు ఒకరోజు ముందు కోచ్ గంభీర్‌తో మాట్లాడాను. అతడు ఒకటే విషయం చెప్పాడు. ఏం జరిగినా కూడా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలని గంభీర్ సూచించినట్లు తిలక్ తెలిపాడు.
Tilak Varma said, “after the game I realised that I’ve finished 72 and my Jersey number is also 72”. pic.twitter.com/t8mcSWHKQ0
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2025
బిష్ణోయ్‌కు అలా ఆడాలని చెప్పా..
ఎప్పుడైనా సరే.. ఎడమ,కుడి బ్యాటింగ్ కాంబినేషన్ బాగుంటుంది. దీంతో ప్రత్యర్థి బౌలర్లు కాస్త ఇబ్బందులు పడుతారు. తరచూ బౌలర్లు తమ లెంగ్త్‌లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేస్తారని మాకు తెలుసు. దక్షిణాఫ్రికాలోనే షార్ట్ పిచ్ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. ఇక్కడ బ్యాటింగ్ చేయడం కంటే అక్కడే కాస్త కష్టం అని తిలక్ చెప్పాడు.
IND vs ENG : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను దారుణంగా ట్రోల్ చేసిన సునీల్ గవాస్కర్..
ఇక ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లు చాలా వేగంగా బౌలింగ్ చేస్తారు అన్న సంగతి తెలిసిందే. దీనిపైనా తిలక్ మాట్లాడుతూ.. నెట్స్ కఠినమైన సాధన చేసినట్లుగా తెలిపాడు. అదే ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. ఇక బిష్ణోయ్ బ్యాటింగ్‌కు వచ్చేటప్పటికి పరిస్థితులు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఖాళీలను చూసి షాట్లు ఆడాలని మాత్రమే అతడికి చెప్పినట్లు తిలక్ వెల్లడించాడు. ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో బిష్ణోయ్ ఆడిన ఫ్లిక్ షాట్, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో కొట్టిన బౌండరీతో లక్ష్య ఛేదన సులువైందని తిలక్ తెలిపాడు.
ప్రస్తుతం తిలక్ వర్మ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో (107*, 120*, 19*, 72* ) ఔట్ కాకుండా 318 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తిలక్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మార్క్‌చాప్‌మన్ (271 పరుగులు) ను అధిగమించాడు.
లక్ష్య ఛేధన సులువైంది.’అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.