Tilak Varma : అద‌ర‌గొట్టిన తిల‌క్ వ‌ర్మ‌.. టీ20ల్లో వ‌రుస‌గా రెండో శ‌త‌కం..

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై టీమ్ఇండియా యువ ఆట‌గాడు, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ అద‌ర‌గొడుతున్నాడు.

Tilak Varma second indian with second T20I hundred in a row

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై టీమ్ఇండియా యువ ఆట‌గాడు, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ అద‌ర‌గొడుతున్నాడు. వ‌రుస‌గా రెండో టీ20 మ్యాచులోనూ శ‌త‌కంతో చెల‌రేగాడు. జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో కేవ‌లం 41 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో వ‌రుస‌గా రెండు టీ20ల్లో సెంచ‌రీ చేసిన రెండో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. తిల‌క్ కంటే ముందు సంజూ శాంస‌న్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

SA vs IND : చ‌రిత్ర సృష్టించిన సంజూశాంస‌న్‌.. టీ20ల్లో మూడో సెంచ‌రీ

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..
సంజూశాంస‌న్ – బంగ్లాదేశ్‌, ద‌క్షిణాప్రికాల‌పై 2024లో
తిల‌క్ వ‌ర్మ – ద‌క్షిణాఫ్రికా పై 2024లో