SA vs IND : చ‌రిత్ర సృష్టించిన సంజూశాంస‌న్‌.. టీ20ల్లో మూడో సెంచ‌రీ

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అద‌ర‌గొడుతున్నాడు

SA vs IND :  చ‌రిత్ర సృష్టించిన సంజూశాంస‌న్‌..  టీ20ల్లో మూడో సెంచ‌రీ

Sanju Samson second century in t20s vs south africa

Updated On : November 15, 2024 / 10:11 PM IST

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అద‌ర‌గొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో శ‌త‌కాల‌తో చెల‌రేగుతున్నాడు. నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌లో రెండో శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు. జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో 51 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాది శ‌త‌కాన్ని అందుకున్నాడు.

అంత‌ర్జాతీయ టీ20 కెరీర్‌లో శాంస‌న్‌కు ఇది మూడో శ‌త‌కం. ఇందులో ఒక‌టి బంగ్లాదేశ్ పై సాధించ‌గా మిగిలిన రెండు కూడా ద‌క్షిణాఫ్రికా పై ఈ సిరీస్‌లో సాధించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఒకే కాల్యెండ‌ర్ ఇయ‌ర్ మూడు సెంచ‌రీలు సాధించిన తొలి భార‌త బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

AUS vs IND : బాబోయ్‌.. ఆసీస్ గ‌డ్డ‌పై ఇర‌గ‌దీస్తున్న‌ భార‌త బ్యాట‌ర్లు.. 15, 15, 19.. ఇలా ఆడితే..