AUS vs IND : బాబోయ్‌.. ఆసీస్ గ‌డ్డ‌పై ఇర‌గ‌దీస్తున్న‌ భార‌త బ్యాట‌ర్లు.. 15, 15, 19.. ఇలా ఆడితే..

వ‌రుస‌గా మూడో సారి బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకోవాల‌ని టీమ్ఇండియా ఆరాట‌ప‌డుతోంది.

AUS vs IND : బాబోయ్‌.. ఆసీస్ గ‌డ్డ‌పై ఇర‌గ‌దీస్తున్న‌ భార‌త బ్యాట‌ర్లు.. 15, 15, 19.. ఇలా ఆడితే..

India vs India A Warm Up Match Kohli 15 and Rishabh Pant 19 runs out

Updated On : November 15, 2024 / 3:12 PM IST

AUS vs IND : వ‌రుస‌గా మూడో సారి బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకోవాల‌ని టీమ్ఇండియా ఆరాట‌ప‌డుతోంది. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 22 నుంచి ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మిన‌హా మిగిలిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు ఆసీస్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించారు. ఆసీస్ పిచ్‌ల‌పై అల‌వాటు ప‌డేందుకు ఇంట్రా స్క్వాడ్ వార్మ‌ప్ మ్యాచ్‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఆసీస్ సిరీస్‌కు ఎంపికైన ఆట‌గాళ్ల‌తో పాటు భార‌త్-ఏ జ‌ట్టులోని ఆట‌గాళ్లు అంద‌రూ క‌లిసి ఈ మ్యాచ్ ఆడుతున్నారు. బ్యాట‌ర్లు, బౌల‌ర్లుగా విడిపోయి మ్యాచ్ ఆడుతున్నారు. పెర్త్‌లోని వాకా మైదానంలో ఈ మ్యాచ్ జ‌రుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి లేన‌ట్లుగా తెలుస్తోంది.

AUS vs IND : ఆసీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే టీమ్ఇండియాకు వ‌రుస షాక్‌లు.. ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు గాయాలు!

ఇక పిచ్ పేస‌ర్ల‌కు అనుకూలిస్తుండ‌డంతో బ్యాట‌ర్లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ గాయ‌ప‌డి మైదానాన్ని వీడ‌గా.. స్టార్ ఆట‌గాళ్లు త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించాడు. కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. అయితే.. కోహ్లీ ఔటైన వెంట‌నే నెట్స్‌కి వెళ్లి ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

గ‌త ఏడాదిగా టెస్టుల్లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న య‌శ‌స్వి జైస్వాల్ 15 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకోగా, రిష‌బ్ పంత్ 19 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

Mohammed shami : ఆస్ట్రేలియా టూర్‌కు మహ్మద్ షమీ.. ఆ రెండు పరీక్షలు పాసైతేనే.. అవేమిటంటే.!

ప్రాక్టీస్ మ్యాచ్ కాబ‌ట్టి ఏం కాదు. టెస్టు సిరీసులో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు ఇలా త‌క్కువ ప‌రుగుల‌కే ఔటైతే మాత్రం మూడో సారి బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని ముద్దాడ‌డం అనేది క‌ల‌గానే మిగిలే అవ‌కాశం ఉంది. అలాగే ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ అవ‌కాశాలు గ‌ల్లంతు అవుతాయి.