AUS vs IND : ఆసీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే టీమ్ఇండియాకు వరుస షాక్‌లు.. ఇద్దరు ఆటగాళ్లకు గాయాలు!
నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

AUS vs IND Another injury scare for India KL Rahul hit on elbow
AUS vs IND : నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో గెలవాల్సి ఉంది. అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
భారత్-ఏ జట్టుతో కలిసి ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బ్యాటర్లు, బౌలర్లు రెండు జట్లుగా విడిపోయారు. ఇక పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో బౌలర్లు చెలరేగుతుండగా, బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
Mohammed shami : ఆస్ట్రేలియా టూర్‌కు మహ్మద్ షమీ.. ఆ రెండు పరీక్షలు పాసైతేనే.. అవేమిటంటే.!
కాగా.. సిరీస్ ప్రారంభానికి ముందే టీమ్ఇండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో సర్ఫరాజ్ ఖాన్ గాయపడినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు వార్మప్ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అతడి కుడి మోచేతికి బంతి బలంగా తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం బ్యాటింగ్ కొనసాగించాలని రాహుల్ భావించాడు.
అయితే.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు. దీంతో అతడు పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్న సందేహాలు మొదలు అయ్యాయి. కాగా.. ఇప్పటి వరకు అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రాహుల్‌కు గాయం కావడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది.