TNPL 2025 : టీఎన్‌పీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ పెను విధ్వంసం.. 11 ఫోర్లు, 3 సిక్సర్లు.. బెంబెలెత్తిన బౌలర్లు..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో అదరగొడుతున్నాడు.

TNPL 2025 Dindigul Dragons vs Trichy Grand Cholas Ravichandran Ashwin 83 runs in just 48 balls
టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో అదరగొడుతున్నాడు. ఆల్‌రౌండ్ షోతో తన జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. దీంతో టీఎన్‌పీఎల్ లీగ్ 2025లో దిండిగల్ డ్రాగన్స్‌జట్టు క్వాలిఫయర్2కి అర్హత సాధించింది.
ఎన్‌పీఆర్ కాలేజీ గ్రౌండ్ వేదికగా బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో దిండిగల్ డ్రాగన్స్, ట్రిచీ గ్రాండ్ చోళస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ట్రిచీ గ్రాండ్ చోళస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. జాఫర్ జమాల్(33), వసీం అహ్మద్(36) లు రాణించారు. డ్రాగన్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. జి పెరియస్వామి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
CAPTAIN RAVICHANDRAN ASHWIN SMASHED 83(48) IN THE TNPL ELIMINATOR 💛
– Ash was opening for Dindigul Dragons in the Big Game. pic.twitter.com/AxmgrdLS67
— Johns. (@CricCrazyJohns) July 2, 2025
అనంతరం 141 లక్ష్య ఛేదనలో రవిచంద్రన్ అశ్విన్ చెలరేగి ఆడాడు. 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 83 పరుగులు సాధించాడు. దీంతో దిండిగల్ డ్రాగన్స్ లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్వాలిఫయర్2కి అర్హత సాధించింది.
శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో చెపాక్ సూపర్ గిల్లీస్‌తో దిండిగల్ డ్రాగన్స్ తలపడనుంది.