T20 World Cup
India vs Pakistan T20 Match: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు రసవత్తర పోరు జరగనుంది. దాయాది జట్లైన భారత్ – పాకిస్థాన్ జట్లు నువ్వానేనా అన్నట్లుగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. మెల్‌బోర్న్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా ఇరుజట్లు తమతమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే, ఈ మ్యాచ్ కు వర్షంముప్పు పొంచిఉంది. ఆదివారం మెల్‌బోర్న్ ప్రాంతంలో జల్లులు కురిసే అవకాశం ఉంది.
T20 World Cup-2022: పాక్ బౌలింగ్ మాకు ఓ సవాలు అని మాకు తెలుసు: రేపటి మ్యాచ్‌పై రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనదిగా టీమిండియా భావిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌లో భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసహా, ఆ దేశ మాజీ క్రికెటర్లు బీసీసీఐ నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టి పాక్ వర్సెస్ భారత్ మ్యాచ్ పై పడింది. వర్షం పడే అవకాశం ఉండటంతో ప్లాన్- బిని భారత్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.
T20 World Cup-2022: న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓటమి
మెల్‌బోర్న్‌లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత్ జట్టు వ్యూహాన్ని మార్చే అవకాశముంది. ఈ సంవత్సరం నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగన రెండవ టీ20 మ్యాచ్‌కోసం రిషబ్ పంత్‌తో సహా ఏడుగురు బ్యాటర్లను భారత్ బరిలోకి దింపిన విషయం విధితమే. తడి అవుట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో వర్షం పడే పరిస్థితులు అధికశాతం ఉంటే అప్పటికప్పుడు టీమిండియా ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
మరోవైపు పాక్ – భారత్ పోరులో మహ్మద్ షమీని బరిలోకి దింపుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ నుండి షమీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. కానీ, గత నాలుగురోజుల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చివరిలో ఒక్క ఓవర్ వేసి అద్భుత ప్రదర్శనను షమీ కనబర్చాడు. దీనికితోడు షమీ ప్రారంభంలోనైనా, చివరి ఓవర్లలోనైనా బౌలింగ్ చేయగలడు. అయితే, పత్యర్థి జట్టు బ్యాటర్ల పరుగుల ప్రవాహాన్ని నియంత్రించడంలో షమీ ఏ మేరకు విజయం సాధిస్తాడనేది ప్రశ్నగా మారింది. దీనికికారణం.. ప్రాక్టీస్ లేకపోవటం, ఏడాదిగా ఎలాంటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో ఆడకపోవటం. మరోవైపు షమీకి ప్రత్యామ్నాయంకూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో షమీ విషయంలో భారత్ జట్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూడాల్సిందే.