T20 World Cup-2022: న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓటమి

న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ముందు నుంచీ తడబడింది. 17.1 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 89 పరుగులు తేడాతో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది.

T20 World Cup-2022: న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓటమి

Updated On : October 22, 2022 / 4:44 PM IST

T20 World Cup-2022: న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ముందు నుంచీ తడబడింది. 17.1 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 89 పరుగులు తేడాతో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. సొంత గడ్డపై ఆడిన తొలి మ్యాచులో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లో ఫిన్ అల్లెన్ 42, కాన్వే 92 (నాటౌట్), కానె విలియమ్సన్ 23, గ్లెన్ ఫిలిప్స్ 12, జేమ్స్ నీషం 26 (నాటౌట్) పరుగులు చేశారు. 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాలో అరోన్ ఫించ్ 13, మార్ష్ 16, మ్యాక్స్ వెల్ 28, టిమ్ డేవిడ్ 11, కమ్మిన్స్ 21 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో 89 పరుగులు తేడాతో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ గెలిచింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..