Today match between India and Pakistan in Asia Cup 2025 do you know where to watch
IND vs PAK : ఆసియాకప్ 2025లో భాగంగా నేడు (సెప్టెంబర్ 14 ఆదివారం) భారత్, పాక్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుండగా, సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో పాక్ ఆడనుంది. ఇరు జట్లు కూడా తమ తమ తొలి మ్యాచ్‌ల్లో పసికూనలపై ఘన విజయాలను సాధించాయి. కాగా.. నేటి మ్యాచ్‌లో విజయం సాధించి సూపర్-4కి చేరువకావాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాక్ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.
దుబాయ్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగాయంటే..?
దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో పాక్ గెలవగా, ఒక్క మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది.
పిచ్ ఎలా స్పందిస్తుంది?
సాధారణంగా దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఎవరు బాగా రాణిస్తారో ఆ జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై స్పిన్‌ను కాచుకుని క్రీజులో నిలదొక్కుకుంటే పరుగుల వరద పారించొచ్చు.
ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆసియాకప్ 2025 ప్రతక్ష్య ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. టీవీల్లో సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. ఇక ఆన్‌లైన్‌లో సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానుంది.
భారత్..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్)
Suryakumar Yadav : పాక్ పై సూర్యకుమార్ యాదవ్ రికార్డు చూస్తే షాకే.. వామ్మో ఇలా ఉందేటి?
పాకిస్తాన్..
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ షాహఫ్‌జాబ్, సలీమ్‌జాదా ఫర్హాన్, మహ్మద్ షాహఫ్జా ఫర్హాన్, సలీం సుఫియాన్ ముఖీమ్.