India vs South Africa T20 Match: రేపు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్.. వర్షం ముప్పు తప్పదా?

పెర్త్ లో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా సెమిస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకోవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. భారత్ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీలు మంచి ఫామ్ లో ఉన్నారు. వీరిలో ఇద్దరు క్రిజ్‌లో పాతుకుపోయినా భారీ స్కోర్ సాధించే అవకాశం ఎక్కువ.

India vs South Africa T20 Match: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా రేపు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. పెర్త్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్, నెదర్లాండ్ జట్లపై విజయం సాధించి గ్రూప్-2లో అగ్రస్థానంలో ఇండియా నిలిచింది. జింబాబ్వే పై వర్షంకారణంగా మ్యాచ్ రద్దు కాగా, బంగ్లాదేశ్‌పై విజయం సాధించి దక్షిణాఫ్రికా జట్టు మూడు పాయింట్లతో ఉంది.

T20 World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్‌పై జింబాబ్వే విజయం

టీ20 మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు లేకపోలేదు. అయితే వాతావరణ శాఖ నిపుణుల పేర్కొన్న ప్రకారం.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కానీ వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు.

T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. పటిష్ట ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం

పెర్త్ లో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా సెమిస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకోవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. భారత్ జట్టుకు బ్యాటింగ్ బలంగా ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీలు మంచి ఫామ్ లో ఉన్నారు. వీరిలో ఇద్దరు క్రిజ్ లో పాతుకుపోయినా భారీ స్కోర్ సాధించే అవకాశం ఎక్కువ. దక్షిణాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ లో బలమైన జట్టుగా ఉంది. దీంతో రేపు జరిగే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు