T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. పటిష్ట ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం

టీ20 వరల్డ్ కప్‌ లో సంచలనం నమోదైంది. పటిష్టమైన ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చింది.

T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. పటిష్ట ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం

T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌ లో సంచలనం నమోదైంది. పటిష్టమైన ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చింది. సూపర్ 12 దశలో భాగంగా ఇంగ్లండ్, ఐర్లాండ్ తలపడ్డాయి. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ ఐర్లాండ్ బ్యాటర్లు రాణించారు. 19.2 ఓవర్లలో ఆలౌట్ అయినా.. 157 పరుగుల టార్గెట్ ను ప్రత్యర్థికి నిర్దేశించారు.

బౌలింగ్‌లోనూ ఐర్లాండ్ ప్లేయర్లు రాణించారు. స్వల్ప విరామాల్లోనే ఇంగ్లండ్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టారు. 14 పరుగులకే ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వికెట్లను తీశారు. ఆ తర్వాత కూడా రెగులర్ ఇంటర్వెల్స్ లో ఇంగ్లండ్ వికెట్లు తీయగలిగారు. దీంతో 14.3 ఓవర్ల దగ్గర 105 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ 5 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విజయానికి 33 బంతుల్లో 53 పరుగులు అవసరమైన సమయంలో క్రీజులో మొయిన్ అలీ (24 నాటౌట్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్)తో క్రీజులో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. కాసేపు వేచిచూసినా తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అంపైర్లు ఫలితాన్ని తేల్చారు. ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు.

ఐర్లాండ్‌ జట్టులో కెప్టెన్‌ బాల్‌బిర్ని హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. లార్సన్ టక్కర్‌ 34 పరుగులతో(27 బంతుల్లో) రాణించారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మలన్‌ 35 పరుగులు చేయగా, మొయిన్‌ అలీ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.