SRH vs PBKS : SRH ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా.. రేపటి మ్యాచ్ లో గెలిస్తే వెళ్తుందా?.. టుక్కు టుక్కు ఆడి ఓడిపోతే..!

శ‌నివారం ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నుంది.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్ర‌ద‌ర్శ‌న నిరాశ‌ప‌రుస్తోంది. టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ వ‌రుస ప‌రాజ‌యాల‌తో చ‌తికిల ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడ‌గా.. ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో ఉంది.

ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాలంటే శ‌నివారం ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ముఖ్యం. బ‌లం అనుకున్న బ్యాట‌ర్లే ఇప్పుడు బ‌ల‌హీనత‌గా మారింది. ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌ల వైఫ‌ల్యం జ‌ట్టుకు తీవ్ర న‌ష్టం చేస్తోంది.

RCB vs DC : ర‌జ‌త్ పాటిదార్ కెప్టెన్సీ పై కోహ్లీ అసంతృప్తి..? దినేశ్ కార్తీక్‌తో సుదీర్ఘ సంభాష‌ణ‌..

ఈ ఇద్ద‌రు విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల‌తో చెల‌రేగితే జ‌ట్టు భారీ స్కోరు చేస్తోంది. బ్యాటింగ్‌కు స‌ర్వ‌ధామంగా పేరొందిన ఉప్ప‌ల్ పిచ్‌లో వీరిద్ద‌రితో పాటు ఇషాన్ కిష‌న్‌, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అనికేత్ వ‌ర్మ‌ చెల‌రేగితే ఎస్ఆర్‌హెచ్‌కు తిరుగుండ‌దు. పాట్ క‌మిన్స్‌, ష‌మీ, ఆడ‌మ్ జంపా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ ల‌తో కూడిన బౌలింగ్ విభాగం ప‌టిష్టంగానే ఉంది.

ప్లే ఆఫ్స్ చేరాలంటే?

పంజాబ్‌తో మ్యాచ్‌లో క‌లిపి స‌న్‌రైజ‌ర్స్ ఇంకో 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో క‌నీసం 8 మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు ఆ జ‌ట్టు విజ‌యాల సంఖ్య 9కి చేరుకుంది. అప్పుడు 18 పాయింట్ల‌తో ఎలాంటి స‌మీక‌ర‌ణాలు అవ‌స‌రం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌వ‌చ్చు. అలాకాకున్నా కూడా క‌నీసం 7 మ్యాచ్‌ల్లో గెలిచినా అప్పుడు 8 విజ‌యాల‌తో ప్లేఆఫ్స్ లో అవ‌కాశాలు స‌జీవంగా ఉంటాయి. మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవ‌చ్చు. వ‌రుస విజ‌యాల‌ను సాధించ‌డంతో త‌మ ర‌న్‌రేట్‌ను భారీగా మెరుగుప‌ర‌చుకోవాల్సి అవ‌స‌రం ఉంది.

RCB vs DC : కోహ్లీ ఎంత ప‌ని చేశావ‌య్యా.. ఆ రెండు త‌ప్పిదాలు చేయ‌కుంటే.. మ్యాచ్ గెలిచేవాళ్లం క‌ద‌య్యా..

పంజాబ్‌తో మ్యాచ్‌లో గెలిచినా కూడా పాయింట్ల ప‌ట్టిక‌లో స‌న్‌రైజ‌ర్స్ స్థానం మారే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.