RCB vs DC : రజత్ పాటిదార్ కెప్టెన్సీ పై కోహ్లీ అసంతృప్తి..? దినేశ్ కార్తీక్‌తో సుదీర్ఘ సంభాషణ..
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలవడంతో లక్ష్యాన్నిఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.
వాస్తవానికి ఢిల్లీ లక్ష్య ఛేదన అంత సాఫీగా సాగలేదు. తొలి 30 పరుగులకే ఢిల్లీ టాపార్డర్ ఆటగాళ్లు ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్ మెగర్క్(7), అభిషేక్ పోరెల్ (7) పెవిలియన్‌కు చేరుకున్నారు. అయిన్పటికి ఈ అవకాశాన్ని ఆర్‌సీబీ బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆఖరి ఓవర్లలో సైతం ఆర్‌సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు.
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ను జోష్ హాజిల్‌వుడ్ వేశాడు. ఈ ఓవర్‌లో అతడు ఏకంగా 22 పరుగులు (4,4,2,2,4,6) ఇచ్చాడు. ఈ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బౌలర్లు, ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం సరిగా లేదన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తున్న వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రాలు మాట్లాడుతూ.. కోహ్లీ దేనిపైనో అసంతృప్తితో ఉన్నాడు. ఇప్పుడు అతడు జట్టుకు కెప్టెన్ కాదు. కాబట్టి అతడు పాటిదార్ చెబితే బాగుంటుందని వారు అన్నారు.
True. He had a long discussion with DK…then he spoke with Bhuvi .. he didn’t even join the group while the last strategic time out.
He was not happy with something for sure.Video credit: @JioHotstar pic.twitter.com/0pAXuDWP0w
— KC (@chakriMsrk) April 10, 2025
ఈ వీడియోలు వైరల్‌గా మారగా.. పాటిదార్ కెప్టెన్సీ పై విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.539గా ఉంది.