Trisha Gongadi creates history
తెలుగమ్మాయి గొంగడి త్రిష అరుదైన ఘనత సాధించింది. అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో ఆమె ఈ ఘనత అందుకుంది.
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం భారత్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన త్రిష స్కాట్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కింది.
Virat Kohli : 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత రంజీల్లో కోహ్లీ.. మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చా?
Trisha Gongadi etches her name in the record books with the first-ever century in Women’s #U19WorldCup history 🤩
➡️ https://t.co/1s19nAR2sR pic.twitter.com/YgGgtVVcJP
— ICC (@ICC) January 28, 2025
ఈ మ్యాచ్‌లో త్రిష మొత్తం 59 బంతులను ఎదుర్కొంది. 13 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచింది. త్రిషతో పాటు మరో ఓపెనర్ కమలిని (51; 42 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే (29; 20 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.
తెలంగాణ యువతి..
త్రిష 2005లో భద్రాచలంలో జన్మించింది. రెండేళ్ల వయస్సు నుంచే ఆటలో ఓనమాలు నేర్చుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతోంది. తండ్రి కలను నేరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఆమె తండ్రి రామిరెడ్డి భద్రాచలం ఐటీసీ కంపెనీలో ఫిట్‌నెస్ ట్రెయినర్‌గా పని చేస్తుండేవారు. కూతురికి క్రికెట్‌లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఉద్యోగాన్ని వదిలి, భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.