×
Ad

IND vs PAK : క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఒకే రోజు రెండు భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌లు..

రెండు టోర్నమెంట్లలోనూ భారత్, పాకిస్తాన్ (IND vs PAK ) ఒకే రోజున తలపడనున్నాయి.

Two india vs pakistan clashes on Februrary 15th 2026

IND vs PAK : టోర్నీ ఏదైనా స‌రే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే వ‌చ్చే కిక్కే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు అన్న సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఫిబ్ర‌వ‌రి 15 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

కాగా.. అదే రోజు మ‌రో భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కూడా జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్ లో పురుషుల జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌గా రెండో మ్యాచ్ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లో భాగంగా జ‌ర‌గ‌నుంది.

IND vs NZ : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. ఆనందంలో టీమ్ఇండియా!

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుద‌ల చేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 13 నుంచి 22 వ‌ర‌కు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. భార‌త మ‌హిళ‌ల‌-ఏ జ‌ట్టుతో పాటు మ‌రో ఏడు జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 13న జ‌ర‌గ‌నుంది. యూఏఈ, నేపాల్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఎనిమిది జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. భార‌త్‌, పాకిస్తాన్‌ల‌తో పాటు యూఏఈ, నేపాల్ జ‌ట్లు గ్రూప్‌-ఏలో ఉండ‌గా, బంగ్లాదేశ్, శ్రీలంక‌, మ‌లేషియా, థాయిలాండ్ జ‌ట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఇక భార‌త-ఏ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్ ను ఫిబ్ర‌వ‌రి 13న యూఏఈతో ఆడ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో ఫిబ్ర‌వ‌రి 15న త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్రకారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

BCCI central contracts : రోహిత్, కోహ్లీకి అగార్క‌ర్ మ‌రో షాక్‌..! బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్టులో ఏ+ గ్రేడ్ తొల‌గింపు..! బికి ప‌డిపోనున్న స్టార్ ఆట‌గాళ్లు!

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్ ఇదే..

* ఫిబ్రవరి 13న – పాకిస్తాన్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 13న – భార‌త్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 14న – మలేషియా vs థాయిలాండ్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 14న – బంగ్లాదేశ్ vs శ్రీలంక (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 15న – యుఏఈ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 15న – భారత్ vs పాకిస్తాన్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 16న – శ్రీలంక vs మలేషియా (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 16న – బంగ్లాదేశ్ vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 17న – భారత్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 17న – పాకిస్తాన్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 18న – బంగ్లాదేశ్ vs మలేషియా (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 18న – శ్రీలంక vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 1 (A1 vs B2) (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 2 (B1 vs A2) (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 22న – ఫైనల్ (మధ్యాహ్నం 2 గంటలకు)