U19 Asia Cup 2025 Abhigyan Kundu double century Malaysia target is 409
U19 Asia Cup 2025 : అండర్-19 ఆసియాకప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, మలేషియా జట్లు తలపడుతున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ (209 నాటౌట్; 125 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు ) చేయడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది.
Innings Break!
A fabulous 2⃣0⃣9⃣*(125) from Abhigyan Kundu guides India U19 to 4⃣0⃣8⃣/7 after 50 overs 👏🙌
Over to our bowlers!
Scorecard ▶️ https://t.co/mKbJZlZcj9#MensU19AsiaCup2025 pic.twitter.com/9hBNRC6KcG
— BCCI (@BCCI) December 16, 2025
IND vs SA : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్.. పండగ చేసుకుంటున్న సౌతాఫ్రికా!
మిగిలిన వారిలో వేదాంత్ త్రివేది (90; 106 బంతుల్లో 7 ఫోర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ (50; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్థశతకాన్ని సాధించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (14), విహాన్ మల్హోత్రా (7) లు విఫలం అయ్యారు. మలేషియా బౌలర్లలో ముహమ్మద్ అక్రమ్ 5 వికెట్లు తీశాడు. సత్నకుమారన్, జాశ్విన్ కృష్ణమూర్తి చెరో వికెట్ సాధించాడు.