Yash Dhull : భారత జట్టులో కరోనా కలకలం.. కెప్టెన్, వైస్ కెప్టెన్‌కు పాజిటివ్

అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ కోసం వెస్టిండీస్ వెళ్లిన భారత యువ జట్టులో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపింది. జట్టులో కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.

Yash Dhull : అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ కోసం వెస్టిండీస్ వెళ్లిన భారత యువ జట్టులో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపింది. భారత జట్టులో కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఆరుగురు ప్లేయర్లు ఐసోలేషన్ కు వెళ్లారు. వీరిలో భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

వీరితో క్లోజ్ గా ఉన్న మరో నలుగురు ప్లేయర్లు జట్టుకి దూరమయ్యారు. కరోనాతో కెప్టెన్ యశ్ దూరం కావడంతో ఐర్లాండ్ తో మ్యాచ్ కి నిశాంత్ సంధు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ తో పాటు ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

అండర్‌-19 ఆసియా కప్ టోర్నీ టైటిల్ గెలిచి, వరల్డ్ కప్ టోర్నీలో అడుగు పెట్టింది భారత అండర్-19 జట్టు. ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది భారత్. దీంతో యువ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఐసీసీ అండర్-19 మెన్స్ వరల్డ్‌ కప్ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది భారత యువ జట్టు.

Amazon Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్స్

టీమిండియా తన తర్వాతి మ్యాచ్ జనవరి 22న ఉగాండా జట్టుతో తలపడనుంది. జనవరి 25 నుంచి క్వార్టర్ ఫైనల్స్, 28 నుంచి సెమీ ఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి. ఆ సమయానికి భారత ప్లేయర్లు కరోనా నుంచి కోలుకోకపోతే టీమిండియాకి ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు