DPL 2025 : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 (DPL 2025) సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నాకౌట్ దశ కొనసాగుతోంది. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సౌత్ ఢిల్లీ బ్యాటర్లలో తేజస్వి దహియా (60; 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు), అన్మోల్ శర్మ (55; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Roger Binny : బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా.. తాత్కాలిక ప్రెసిడెంట్ ఎవరంటే?
అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు 17.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెస్ట్ ఢిల్లీ బ్యాటర్లలో నితీశ్ రాణా (134 నాటౌట్; 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్రిష్ యాదవ్ (31) రాణించాడు.
కొట్టుకునేంత వరకు..
ఈ మ్యాచ్‌లో వెస్ట్ ఢీల్లీ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ను సౌత్ ఢిల్లీ బౌలర్ అమన్ భారతి వేశాడు. తొలి బంతిని వెస్ట్ ఢిల్లీ ఓపెనర్ క్రిష్ యాదవ్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద అన్‌మోల్ శర్మ చేతికి చిక్కాడు. ఈ సమయంలో బ్యాటర్, బౌలర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
DPL eliminator match🔥🔥🌋🌋#DPLT20 pic.twitter.com/0ag54kzNrP
— Aaditya jha (@aadi___45) August 29, 2025
ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. ఈ సమయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో పాటు సహచర ఆటగాళ్లు వారిద్దరిని విడదీశారు. డగౌట్‌కు వెళ్లే క్రమంలో క్రిష్ ఏవో మాటలు అనడంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది. సౌత్ ఢిల్లీ ఆటగాడు సుమిత్ మాథూర్ అసహనం వ్యక్తం చేశాడు. అతడు వేలు చూపిస్తూ క్రిష్ వైపు దూసుకువచ్చాడు.
ఈ సమయంలో మరో బ్యాటర్ నితీశ్ రాణా కలగజేసుకున్నాడు. సమిత్ భుజం పై చేయి వేసి అతడిని పక్కకు తీసుకువెళ్లిపోయారు. ఇక ఔటైన క్రిష్‌ను మైదానం నుంచి వెళ్లిపోవాలని లేడీ అంపైర్ కోరింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.