U-19 Asia Cup : అండర్ 19 ఆసియా కప్ భారత్ కైవసం

దుబాయ్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్ లో భాగంగా ఫైనల్ లో శ్రీలంక - భారత జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు...బ్యాటింగ్ ఎంచుకుంది.

U19 Asia

Under 19s Asia Cup 2021 : అండర్ 19 ఆసియా కప్ లో భారత యువ క్రీడాకారులు కదం తొక్కారు. శ్రీలంక జట్టును మట్టి కరిపించారు. 2021 సంవత్సరంలో చివరి రోజు చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ కు అడుగడుగునా వర్షం అడ్డంకిగా నిలిచింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో యువ భారత జట్టుకు అభినందనలు తెలియచేస్తున్నారు.

Read More : Omicron In UK : యూకేలో ఆస్పత్రిపాలైన వారిలో 90శాతం బూస్టర్ డోసు తీసుకోనివారే..!

దుబాయ్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్ లో భాగంగా ఫైనల్ లో శ్రీలంక – భారత జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు…బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా..38 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. నిర్ణీత ఓవర్లకు ముగిసే సరికి లంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. అనంతరం 107 రన్లతో లక్ష్యానికి దిగిన భారత్ యువ క్రీడాకారులు అద్భుతంగా ఆడారు. ఏమాత్రం శ్రీలంక బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ఓపెనర్ హర్నూర్ సింగ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా..మరో ఓపెనర్ ఆంగ్రీష్ రఘువంశీ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు.

Read More : APSRTC GST : ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్..! వాటి ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే బాదుడే

56 పరుగులు చేసిన ఇతను నాటౌట్ గా నిలిచాడు. ఇతనికి షేక్ రషీద్ చక్కటి సహకారం అందించాడు. ఇతను కూడా 31 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు. ఇద్దరు సహకారం అందించుకుంటూ పరుగులు రాబట్టారు. వీరిని విడదీయడానికి శ్రీలంక బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది. మరోసారి వర్షం కురవడంతో ఇన్నింగ్స్ ను 32 ఓవర్లకు కుదించడమే కాకుండా..లక్ష్య చేధనను కూడా తగ్గించారు. 104 పరుగులకు చేయాల్సి వచ్చింది. రషీద్ – రఘువంశీలు..లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ…21.3 ఓవర్లలో టార్గెట్ ను చేధించారు.

స్కోరు : శ్రీలంక 106/9, భారత్ 104/1
శ్రీలంక బౌలర్లు : రోడ్రిగో ఒక వికెట్ తీశారు.
భారత బౌలర్లు : విక్కి మూడు, కౌశల్ రెండు, రాజ్ వర్ధన్, రవి కుమార్, రాజ్ తలో ఒక వికెట్ తీశారు.