Omicron In UK : యూకేలో ఆస్పత్రిపాలైన వారిలో 90శాతం బూస్టర్ డోసు తీసుకోనివారే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. యూకేలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

Omicron In UK : యూకేలో ఆస్పత్రిపాలైన వారిలో 90శాతం బూస్టర్ డోసు తీసుకోనివారే..!

Uk Covid Booster 90% Of Uk People Hospitalised Didn't Take Booster

Omicron In UK : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. యూకేలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం బోరిస్ జాన్సన్ ప్రభుత్వం చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఒకవైపు కొవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేసినప్పటికీ కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచిస్తోంది. అయితే ఇప్పటివరకూ కరోనాతో ఆస్పత్రిలో పాలైనవారిలో ఎక్కువగా బూస్టర్ డోసు తీసుకోనివారే ఉన్నారని ప్రధాని జాన్సన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్-19తో ఆస్పత్రిలో చేరిన వారిలో 90శాతం మంది బూస్టర్‌ డోసులు తీసుకోలేదని పేర్కొంది.

ఇంగ్లండ్‌లోని ప్రతి పెద్దవారిలో కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్‌ను తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో వేగంగా వ్యాప్తిచెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కంట్రోల్ చేసే వ్యూహంలో కీలక భాగమని పేర్కొంది. ఇంగ్లండ్‌లో 28.1 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు బూస్టర్ డోస్‌లను కలిగి ఉన్నారని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బూస్టర్ డోసుకు 10 మంది పెద్దవారిలో ఏడుగురు అర్హత కలిగిన ఉన్నారని యూకే అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ కేసుల తీవ్రతను అడ్డుకోవాలంటే కరోనా ఆంక్షలు విధించడం కాదని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని జాన్సన్ నూతన సంవత్సర సందేశంలో పిలుపునిచ్చారు.

ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో టెస్టింగ్ కిట్ల కొరత సమస్య ఎదురవుతోంది. ఆస్పత్రిలో చేరే కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాన్సన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. గురువారం నాటికి 11,452 మంది కోవిడ్ -19తో ఇంగ్లాండ్‌లోని ఆసుపత్రిలో చేరారు. లేటెస్ట్ NHS ఇంగ్లాండ్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది జనవరిలో 34వేల కంటే ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ 28న కొత్తగా 2,082 కరోనా కేసులు పెరిగాయి.

కరోనా కేసుల దృష్ట్యా.. బాధితుల కోసం ముందు జాగ్రత్తగా చర్యగా మరో ఎనిమిది ఆస్పత్రుల్లో తాత్కాలిక కోవిడ్ వార్డులను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2020లో మొదటి కోవిడ్-19 వేవ్ సమయంలో ఏర్పాటు చేసిన నైటింగేల్ ఆస్ప్రతుల మాదిరిగా మార్చనుంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నప్పటికీ దాని తీవ్రత లక్షణాలు మాత్రం మునపటి కరోనావైరస్ వేరియంట్‌ల కంటే తక్కువ తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డెల్టా వేరియంట్.. కోవిడ్-19 కేసుల తీవ్రతను మరింత పెంచే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రుల్లో చేరే బాధితుల్లో ఎక్కువమంది బూస్టర్ డోసు తీసుకునివారే ఉన్నారని, బూస్టర్ డ్రైవ్ సందర్భంగా ఇంకా పూర్తిగా టీకాలు తీసుకోనివారితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నానని జాన్సన్ చెప్పారు. గురువారం ఒక్కరోజే యూకేలో 189, 213 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఒమిక్రాన్ వ్యాప్తితో రెండోరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 28 రోజుల వ్యవధిలో మరో 332 మంది కరోనాతో మరణించారు. మార్చి నుంచి రోజువారీ కరోనా టెస్టులు మొత్తంగా రికార్డు స్థాయిలో పెరిగాయని, కరనా మరణాలపై స్పష్టత లేదని NHS ఇంగ్లాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Read Also : New Florona Variant ఇజ్రాయెల్ లో బయటపడ్డ మరో కొత్తరకం కరోనా వేరియంట్ “ఫ్లోరోనా”