India Vs Australia :అండర్‌-19 ప్రపంచకప్‌.. భారత జట్టుకు కఠిన పరీక్ష

వార్మప్‌ మ్యాచ్‌లో కంగారూలను ఓడించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.! కరోనా బారిన పడిన నిశాంత్‌ సిద్ధూ కోలుకుని సెమీస్‌కు అందుబాటులో ఉండడం సానుకూలాంశం...

India Vs Australia  :అండర్‌-19 ప్రపంచకప్‌.. భారత జట్టుకు కఠిన పరీక్ష

India 19

Updated On : February 2, 2022 / 10:29 AM IST

Under 19th World Cup : అండర్‌-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టుకు టోర్నీలో తొలిసారి కఠిన పరీక్ష ఎదురునుంది. 2022, ఫిబ్రవరి 02వ తేదీ బుధవారం జరిగే సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను యవ భారత్‌ ఢీకొంటుంది. క్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయాన్ని అందుకున్న టీమిండియా.. సెమీస్‌లోనూ ఇదే జోరు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. కరోనా నుంచి కోలుకుని కీలక ఆటగాళ్లు జట్టులోకి చేరడం భారత్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బంగ్లాతో పోరులో అది స్పష్టంగా కనిపించింది.

Read More : China : డేటా చోరీలో దూసుకపోతున్న డ్రాగన్ కంట్రీ

అయితే రెండుసార్లు ఛాంపియన్‌ ఆసీస్‌ను ఓడించడం టీమిండియాకు అంత తేలికేం కాదు. కానీ ఫామ్‌లో ఉన్న రఘువంశీ, రషీద్‌, రవికుమార్‌, విక్కీ, రాజ్‌ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. ముఖ్యంగా బంగ్లాపై విజృంభించిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ రవికుమార్‌ సత్తా చాటాలని టీమిండియా కోరుకుంటోంది. అటు ఆసీస్‌ను అడ్డుకోవాలంటే స్టార్‌ ఓపెనర్‌ విల్లీ.. బౌలర్లు టామ్‌ విట్నీ, విలియమ్‌, స్లాజ్‌మన్‌లను నిలువరించడం కీలకం. ముఖ్యంగా 17 ఏళ్ల విల్లీ తన అటాకింగ్‌ బ్యాటింగ్‌తో ఆరంభంలోనే విరుచుకుపడుతున్నాడు. అతడిని తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేర్చగలిగితే ఆసీస్‌ని దెబ్బ కొట్టొచ్చు. వార్మప్‌ మ్యాచ్‌లో కంగారూలను ఓడించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.! కరోనా బారిన పడిన నిశాంత్‌ సిద్ధూ కోలుకుని సెమీస్‌కు అందుబాటులో ఉండడం సానుకూలాంశం.