Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 9 సిక్సర్లు, 6 ఫోర్లతో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్

టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

vaibhav suryavanshi

Vaibhav Suryavanshi: టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ అండర్ 19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా.. మొదటి మ్యాచ్ లో భారత జట్టు, రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయాలు సాధించాయి. అయితే, బుధవారం జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ఈ సిరీస్ లో 2-1తో భారత్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Also Read: ENG vs IND : రెండో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్‌బాస్ట‌న్‌లో టీమ్ఇండియాకు ఇంత ఘోరమైన రికార్డు ఉందా..?

ఈ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో 40 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు అదరగొట్టింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. మొత్తం 31బంతుల్లో ఆరు సిక్సులు, తొమ్మిది ఫోర్లతో వైభవ్ 86 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి తోడు విహార్ మల్హోత్రా (46), కనిష్క చౌహన్ (43 నాటౌట్), అంబ్రీష్ (31 నాటౌట్) రాణించడంతో భారత్ జట్టు 34.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్..
ఇంగ్లాండ్ లో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో 48 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. రెండో వన్డేలో 45 పరుగులు చేశాడు. తాజాగా జరిగిన మూడో వన్డేలో ఆఫ్ సెంచరీ పూర్తి చేసి 86 పరుగులు చేశాడు. మరోవైపు.. తన అద్భుతమైన బ్యాటింగ్ తో వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా అండర్ -19 వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ అండర్-19 వన్డేల్లో 18బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.


ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ సురేశ్ రైనా పేరిట ఉన్న అండర్-19 రికార్డును బ్రేక్ చేశాడు. యూత్ వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 80 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 277.41 స్ట్రైక్‌రేట్ వైభవ్ 86 పరుగులు చేయగా.. సురేశ్ రైనా 2004లొ 236.84 స్ట్రైక్‌రేట్‌తో స్కాట్లాండ్‌పై 90 పరుగులు చేశాడు.