Vaibhav Suryavanshi Poor Run Continues In U19 Asia Cup Match vs Japan
ప్రస్తుతం అందరి దృష్టి 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీపైనే ఉంది. ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కాడు. వేలంలో ఈ కుర్రాడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ రూ.1.10 కోట్లు వెచ్చించి ఈ ఆటగాడిని సొంతం చేసుకుంది. ఈ లైఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దూకుడుగా ఆడుతాడు అనే పేరుంది.
అయితే.. మెగా వేలం తరువాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ వైభవ్ నిరాశ పరిచాడు. అతడు ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన వైభవ్.. తాజాగా నేపాల్‌తో మ్యాచ్‌లోనూ విఫలం అయ్యాడు.
WTC Final Qualification : భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు ఉన్న 4 మార్గాలు ఇవే..
23 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 23 పరుగులు మాత్రమే చేశాడు.
కాగా.. వేలంలో సూర్య వంశీని ఎందుకు కొనుగోలు చేశామో అన్న విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు. ఆర్ఆర్ నిర్వహించిన సెలక్షన్స్ ట్రయల్స్‌లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడన్నారు. అతడి ఆట పట్ల తాము సంతోషంగా ఉన్నామన్నాడు. అతడిలో అద్భుత ప్రతిభ ఉందని, అతడు ఎదగడానికి ఇది ఓ మంచి వాతావరణం అని తాము అనుకుంటున్నట్లు చెప్పాడు.
So called 13 years old Vaibhav Suryavanshi in the U19 Asia Cup so far.
– 1 (9).
– 23 (23). #VaibhavSuryavanshi #U19AsiaCup #PakistanCricket #Cricket #AsiaCupU19 #RohitSharma pic.twitter.com/qemL9MfYrR— Anil Kumar (@Anilkumarsports) December 2, 2024