వినేశ్ ఫోగట్, భజరంగ్‌లకు రాజీవ్ ఖేల్ రత్న

వినేశ్ ఫోగట్, భజరంగ్‌లకు రాజీవ్ ఖేల్ రత్న

Updated On : April 29, 2019 / 7:23 AM IST

క్రీడలలో అత్యంత ఉన్నతంగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియాలను రికమెండ్ చేస్తున్నారు. సోమవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు సాధించిన  విజయాల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 

ఇదిలా ఉంచితే, రాహుల్ అవారె, హర్‌ప్రీత్ సింగ్, దివ్య కక్రాన్, పూజా దండాలను అర్జున అవార్డుకు సిఫారసు చేశారు. వీరేందర్ కుమార్, సుజీత్ మాన్, నరేంద్ర కుమార్, విక్రమ్ కుమార్‌లను ద్రోణాచార్య అవార్డుకు.. భీమ్ సింగ్, జై ప్రకాశ్‌లను ధ్యాన్ చంద్ అవార్డుకు నామినేట్ చేశారు.