×
Ad

Viral video : ఇదేంట్రా బాబు.. పాక్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద‌ మేక‌, రెండు బాటిళ్ల వంట‌నూనె..?

పాకిస్తాన్ క్రికెట్‌లో మాత్రం ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఓ మేక‌, రెండు బాటిళ్ల ఆయిల్ ను అందిస్తున్నట్లుగా ఉన్న‌ ఓ వీడియో ప్ర‌స్తుతం (Viral video) సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

is this true Man of the Match in Pakistan receive a goat and two bottles of oil

Viral video : సాదార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఇవ్వ‌డాన్ని చూస్తూనే ఉంటాం. ఆ మ్యాచ్‌లో ఎవ‌రు బాగా ఆడితే వారికి ఆ అవార్డు ఇస్తూ ఉంటారు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఎక్కువ‌గా న‌గదు బ‌హుమ‌తితో పాటు ఓ షీల్డ్ లేదా బ‌హుమ‌తిని అందిస్తూ ఉంటారు. ఇది టోర్నీ స్థాయిని బ‌ట్టి మారుతూ ఉంటుంది.

అయితే.. పాకిస్తాన్ క్రికెట్‌లో మాత్రం ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఓ మేక‌, రెండు బాటిళ్ల ఆయిల్ ను అందిస్తున్నట్లుగా ఉన్న‌ ఓ వీడియో (Viral video) ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Smriti Mandhana : శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్.. స్మృతి మంధాన చ‌రిత్ర సృష్టించేనా?

అయితే.. ఈ వీడియోలో ఉన్న‌ది నిజం కాదు.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉప‌యోగించిన చేసిన వీడియోగా తెలుస్తోంది. పాక్‌లో ఏ స్థాయి క్రికెట్‌లోనూ ఇలాంటి అవార్డులు ఇవ్వ‌లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (పీసీబీ)ని విమ‌ర్శించేందుకే ఈ వీడియోను జ‌న‌రేట్ చేసిన‌ట్లుగా ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

హెయిర్ డ్రైయ‌ర్‌, ట్రిమ్మ‌ర్‌..

పై వీడియో ఫేక్ అయిన‌ప్ప‌టికి పాక్ క్రికెట్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ కింద విచిత్ర బ‌హుమ‌తులు అందించిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్‌) లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఓ ఆట‌గాడికి హెయిర్ డ్రైయ‌ర్, మ‌రో ఆట‌గాడికి ట్రిమ్మ‌ర్ బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం తెలిసిందే.

Team India : ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఏడుగురు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 భార‌త జ‌ట్టులో..