Rahmanullah Gurbaz : రోడ్లపై నిద్రిస్తున్న వారికి డబ్బులు పంచిన క్రికెటర్ .. మనసుని హత్తుకున్న వీడియో

క్రికెట్ మైదానంలో ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకోవడమే కాదు.. మైదానం బయట తను చేసిన మంచి పనితో అందరి మనసుల్ని దోచుకున్నాడు ఆ క్రికెటర్.. ఇంతకీ అతనేం చేశాడు?

Rahmanullah Gurbaz  : రోడ్లపై నిద్రిస్తున్న వారికి డబ్బులు పంచిన క్రికెటర్ .. మనసుని హత్తుకున్న వీడియో

Rahmanullah Gurbaz

Updated On : November 12, 2023 / 4:19 PM IST

Rahmanullah Gurbaz : తెల్లవారు ఝామున 3 గంటలు.. అహ్మదాబాద్ వీధుల్లో ఓ క్రికెటర్ రోడ్లపై నిద్రిస్తున్న వారి పక్కన డబ్బులు ఉంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు అందరి మనసుని హత్తుకుంది. ఇంతకీ ఎవరా క్రికెటర్? చదవండి.

England Announce Squad : వరల్డ్ కప్ దెబ్బతో మారిన ప్లేయర్స్.. వెస్టిండీస్‌తో సిరీస్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అహ్మదాబాద్ వీధుల్లో ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న పేదవారి పక్కన డబ్బులు ఉంచుతూ వీడియోలో కనిపించారు. తిరిగి తన కారులో వెళ్లిపోతున్నట్లు ఫుటేజ్‌లో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు గుర్బాజ్ మంచి మనసుకి ఫిదా అయిపోయారు. ఆటలోనే కాదు మైదానం బయటకూడా గుర్బాజ్ తమ మనసు గెలుచుకున్నారంటూ కామెంట్లు పెట్టారు.

2023 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీం అద్భుతమైన ఆటతీరుతో చెరిగిపోని ముద్ర వేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌పై 69 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. కానీ అహ్మదాబాద్‌లో జరిగిన చివరి లీగ్-స్టేజ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ICC World Cup : వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ బెర్తులు ఖరారు.. అర్హత సాధించిన ఆ నాలుగు జట్లు

గుర్బాజ్ టోర్నమెంట్‌లో తన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లలో 31.11 సగటుతో 98.93 స్ట్రైక్ రేట్‌తో 280 పరుగులు చేశాడు.