Champions Trophy: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కోహ్లీ, అనుష్క శర్మ సంబరాలు వేరేలెవెల్.. తల నిమురుతూ.. గట్టిగా హత్తుకొని.. వీడియోలు వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం తరువాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ..

Virat Kohli and Anushka Sharma

Virat Kohli Anushka Sharma: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా టీమిండియా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. తద్వారా టీమిండియా 12ఏళ్ల విరామం తరువాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి భారత్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ వెంటనే భారత్ జట్లు ప్లేయర్లు, అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

Also Read: Champions Trophy 2025: అయ్యో ఇలా ఔటయ్యావేంటి..! రోహిత్ శర్మ ఔటైనప్పుడు అతని సతీమణి, కుమార్తె స్పందన చూశారా..

భారత్ జట్టు విజయం తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలో ఒకరినొకరు హత్తుకొని, కోలాటం ఆడుతూ సందడి చేశారు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సంబురాలు వేరే లెవల్ అని చెప్పొచ్చు. మ్యాచ్ అనంతరం ఇద్దరు భావోద్వేగానికి గురయ్యారు. మ్యాచ్ గెలిచిన వెంటనే అనుష్క శర్మ స్టాండ్స్ నుంచి మైదానం వైపు రావడం ప్రారంభించింది. ఇది గమనించిన విరాట్ కోహ్లీ అనుష్కవైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దీంతో కోహ్లీ తల నిమురుతూ గట్టిగా హత్తుకొని అనుష్క అభినందించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

మైదానంలోనూ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సందడి చేశారు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ విజయం అనంతరం కోహ్లీ, అనుష్క శర్మ సంబురాలు చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఫ్యాన్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో కామెంట్లు, పోస్టులతో హోరెత్తించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు బయట కూడా అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇది స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం” అని రాసుకొచ్చారు.