Champions Trophy 2025: అయ్యో ఇలా ఔటయ్యావేంటి..! రోహిత్ శర్మ ఔటైనప్పుడు అతని సతీమణి, కుమార్తె స్పందన చూశారా..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది

Rohit sharma
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 76 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ తరువాత టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి రోహిత్ శర్మ, శుభమన్ గిల్ వచ్చారు. రోహిత్ శర్మ మొదటి నుంచి సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. అయితే, 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రచిన్ రవీంద్ర బౌలింగ్ లో రోహిత్ శర్మ ముందుకొచ్చి ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు.
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర 27వ ఓవర్ వేయగా.. ఆ ఓవర్ లో మొదటి బంతిని రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడాడు. ఈ క్రమంలో బాల్ మిస్ అయ్యి కీపర్ చేతికి వెళ్లింది. కివీస్ కీపర్ టామ్ లాథమ్ వెంటనే స్టంప్ ఔట్ చేశాడు. దీంతో రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశ ఎదురయింది. రోహిత్ ఔట్ అయిన సమయంలో అతని సతీమణి రితికా సజ్దే, రోహిత్ కుమార్తె స్పందన వైరల్ అవుతుంది. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మొత్తం 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
Reaction of Ritika Sajdeh after #RohitSharma “Stump out”.
#ChampionsTrophy2025#ChampionsTrophy #NZvIND #INDvNZ #NZvsIND #INDvsNZ pic.twitter.com/zsnYOKeExi— The News World (@thenewsworld7) March 9, 2025
HIGH & HANDSOME! 🙌#RohitSharma steps out & welcomes Nathan Smith with a 93m six! 🤯#ChampionsTrophyOnJioStar FINAL 👉 #INDvNZ | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!
📺📱 Star watching FREE on JioHotstar: https://t.co/Bp0noOiMnu pic.twitter.com/6OmjhbNdOx
— Star Sports (@StarSportsIndia) March 9, 2025