Rohit Sharma Retirement : క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ లేనట్టే.. 2027 వరల్డ్ కప్ కొట్టడమే టార్గెట్..!
Rohit Sharma Retirement : రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. కానీ, అందరి మదిలో ఒకే ఒక ప్రశ్న.. రోహిత్ చివరి వన్డే మ్యాచ్ అవుతుందా? కానీ, అన్నింటికి ఒక్క మాటతో తెరదించాడు హిట్ మ్యాన్..

Rohit Sharma Retirement
Rohit Sharma Retirement : ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ టీమిండియా దక్కించుకుంది. భారతీయ క్రికెట్ అభిమానుంతా ఆనందంలో మునిగిపోయారు. వరుసగా రెండోసారి ఛాంపియన్ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రసంశంల జల్లు కురుస్తోంది. ఈ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పటివరకూ రోహిత్ రిటైర్మెంట్ గురించి అనేక పుకార్లు వ్యాపించాయి.
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఖాయేమనంటూ ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ ఊహాగానాలన్నీంటికి తెరదించాడు హిట్ మ్యాన్.. ఇన్నాళ్లుగా మౌనం వహించిన రోహిత్ శర్మ.. ఛాంపియన్ ట్రోఫీ విజయం సందర్భంగా రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెడుతూ తన మనసులో మాట బయటపెట్టేశాడు.
నో ఫ్యూచర్ ప్లానింగ్స్.. నో రిటైర్మెంట్ :
‘భవిష్యత్తు ప్రణాళికలు అంటూ ఏమి లేవు. ఏదైనా జరుగుతూనే ఉంటుంది (జో హో రహా హై.. వో చల్తా జాయేగా)’ హింట్ మ్యాన్ సమాధానిమిచ్చాడు. ఈ ఒక్క మాటతో రోహిత్ శర్మ వన్డే క్రికెట్ వీడ్కోలు పలుకుతాడనే ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది.
రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో భారత జట్టుకు రెండోసారి టైటిల్ సాధించి పెట్టాడు. రోహిత్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అందరూ ఊహించినట్టుగానే ఛాంపియన్ ట్రోఫీ భారత్ వశమైంది. కానీ, ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఉంటుందని భయపడ్డారు అభిమానులు. కానీ, ట్రోఫీని గెలుచుకోవడంతో రోహిత్ ఈ ఊహాగానాలు, పుకార్లన్నింటికీ ముగింపు పలికాడు. ఈ వన్డే ఫార్మాట్ నుంచి తాను ప్రస్తుతానికి రిటైర్ కావడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు.
రిటైర్మెంట్ ఆలోచన ఇప్పట్లో లేదు :
ఈ ఫైనల్‌కు ముందు, భారత్ గెలిచినా, ఓడినా, ఈ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు, అనేక పుకార్లు వచ్చాయి. లేదంటే ఇదే రోహిత్ చివరి వన్డే మ్యాచ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా లేదా అని అందరూ ఎదురుచూశారు. రోహిత్ దీనిపై ఇప్పటివరకూ నోరువిప్పలేదు. మ్యాజ్ విజయం తర్వాత అందరి దృష్టి మీడియా సమావేశంపైనే పడింది. భారత కెప్టెన్ తన రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని స్పష్టం చేశాడు.
భారత్ ఛాంపియన్ రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కెప్టెన్ పైకి లేచి వెళ్తూ.. వెనక్కి తిరిగి ‘‘అవును.. చివరిగా ఒక విషయం.. నేను ఈ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదు. ఇకపై ఎలాంటి పుకార్లు రాకుండా ఉండేందుకు దీనిపై స్పష్టత ఇస్తున్నాను.” అంటూ క్లారిటీ ఇచ్చాడు.
రోహిత్ చేసిన ఈ ఒక్క ప్రకటనతో టీమిండియా సహా ముఖ్యంగా రోహిత్ అభిమానుల్లో ఆనందం వెల్లువెరిసింది. కెప్టెన్ టీమిండియాను ఛాంపియన్‌గా నిలపడమే కాకుండా ఫైనల్‌లో అత్యధిక పరుగులు చేసి రిటైర్మెంట్ పుకార్లకు కూడా ఎండ్ కార్డు వేశాడు.
2027 వరల్డ్ కప్ రోహిత్ టార్గెట్ :
2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనేది తన కోరికని రోహిత్ గతంలోనే చాలాసార్లు చెప్పాడు. ఈ టైటిల్ గెలవడమే తన లక్ష్యమని కూడా చెప్పాడు. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన రోహిత్.. ఈ వరల్డ్ కప్ టైటిల్‌పై కన్నేశాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 2023 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించింది. కానీ, ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత రోహిత్ 2027 ప్రపంచ కప్ ఎలాగైనా కొట్టితీరాల్సిందే అన్నట్టుగా చెబుతున్నాడు.