Champions Trophy : మొన్న బాడీ షేమింగ్.. ఇప్పుడు హ్యాట్సాఫ్ అంటూ రోహిత్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ కామెంట్స్ వైరల్!

Champions Trophy : రోహిత్ శర్మను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్, ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నందుకు టీమిండియా కెప్టెన్‌ను ప్రశసంలతో ముంచెత్తారు.

Champions Trophy : మొన్న బాడీ షేమింగ్.. ఇప్పుడు హ్యాట్సాఫ్ అంటూ రోహిత్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ కామెంట్స్ వైరల్!

Hats off to Rohit Sharma

Updated On : March 9, 2025 / 11:44 PM IST

Champions Trophy : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియాను కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ అభినందించారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు భారత జట్టుకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె అభినందనలు తెలియజేశారు.

76 పరుగులతో జట్టు విజయాన్ని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు షామా సెల్యూట్ చేశారు. అంతేకాదు.. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయపథంలో నడిపించారంటూ కాంగ్రెస్ నేత షామా ప్రశంసలతో ముంచెత్తారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 6 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రోహిత్ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

ఇటీవలే కాంగ్రెస్ నేత షామా రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన సంగతి తెలిసిందే. హిట్ మ్యాన్ లావుగా ఉన్నాడంటూ కెప్టెన్ గా పనికిరాడంటూ తీవ్రంగా ఆమె అవమానించారు. ఆ తర్వాత షమాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే షామా తన ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది. ఒక ఆటగాడి ఫిట్‌నెస్ గురించి ట్వీట్ అంటూ షమా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అది బాడీ షేమింగ్ కాదు.. ఆటగాడు ఫిట్‌గా ఉండాలని నమ్ముతానని చెప్పుకొచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా షమీ వ్యాఖ్యలను సమర్థించలేదు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహమ్మద్ ఒక దిగ్గజ క్రికెటర్ గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఆ ట్వీట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి వెంటనే డిలీట్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.