Champions Trophy : హిట్ మ్యాన్ అదరగొట్టాడు.. వరుసగా రెండోసారి.. ధోని తర్వాత రోహిత్ శర్మనే.. కపిల్, గంగూలీ రికార్డులను బ్రేక్ చేశాడు..!

Champions Trophy : రోహిత్ శర్మ ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ తర్వాత దేశం తరపున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న మూడో భారత కెప్టెన్‌గా అవతరించాడు. భారత్‌కు వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను హిట్ మ్యాన్ అందించాడు.

Champions Trophy : హిట్ మ్యాన్ అదరగొట్టాడు.. వరుసగా రెండోసారి.. ధోని తర్వాత రోహిత్ శర్మనే.. కపిల్, గంగూలీ రికార్డులను బ్రేక్ చేశాడు..!

Rohit Sharma ( Image Source : Google )

Updated On : March 9, 2025 / 11:26 PM IST

Champions Trophy : భారత కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా మరో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా? టీమిండియా టోర్నమెంట్‌ మొత్తంలోనే అజేయంగా నిలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై తొలి మ్యాచ్‌లో విజయంతో మొదలైన పరంపర న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ వరకు ఆగలేదు.

Read Also : IND vs NZ : న్యూజిలాండ్‌కు షాక్‌.. గాయ‌ప‌డిన కేన్‌ విలియ‌మ్స‌న్‌.. కివీస్ బోర్డు అధికారిక ప్ర‌క‌ట‌న..

ధోని 3 సార్లు, గంగూలి, కపిల్ ఒకసారి :
ఎంఎస్ ధోని తన కెప్టెన్సీలో టీం ఇండియాకు 3 ఐసీసీ టైటిళ్లు సాధించి పెట్టాడు. ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ తర్వాత దేశం తరపున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ అవతరించాడు.

మార్చి 9న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌ విజేతగా నిలిచింది. తన కెప్టెన్సీలో విజయాన్ని అందుకున్న రోహిత్ శర్మ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. 252 పరుగుల లక్ష్య ఛేదనలో రవీంద్ర జడేజా బౌండరీ కొట్టడంతో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది.

వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలతో రెండో కెప్టెన్‌గా :
ఈ విజయంతో రోహిత్ భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలను అందించిన రెండవ కెప్టెన్ అయ్యాడు. అంతకుముందు, 2024లో బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అందించాడు. రోహిత్ కన్నా ముందు, ఎంఎస్ ధోని (3), సౌరవ్ గంగూలీ (1), కపిల్ దేవ్ (1) కూడా భారత్‌‌కు ఐసీసీఐ టైటిల్స్ అందించారు.

రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 76 (83) పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ట్రేడ్‌మార్క్ పుల్ షాట్ ద్వారా రెండో బంతిలో భారీ సిక్సర్‌తో సత్తా చాటాడు. కేవలం 41 బంతుల్లో హాప్ సెంచరీని నమోదు చేశాడు. ఐసీసీ ఫైనల్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి.

Read Also : IND vs NZ : ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్‌.. ఫైన‌ల్‌లో న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం.. ముచ్చ‌ట‌గా మూడోసారి..

27వ ఓవర్లో హిట్ మ్యాన్ ఔట్ కాగా భారత్ 26.1 ఓవర్లలో 122/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, శ్రేయాస్ అయ్యర్ 62 బంతుల్లో 48 పరుగులు, అక్షర్ పటేల్ 40 బంతుల్లో 29 పరుగులు చేసి నాల్గవ వికెట్‌కు 61 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కెఎల్ రాహుల్ 33 బంతుల్లో 34 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 18 పరుగులు, రవీంద్ర జడేజా 6 బంతుల్లో 9 పరుగులు, 49 ఓవర్లలో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు, రోహిత్ టీమిండియాను 4 ఐసీసీ టోర్నీల్లో విజయాన్ని అందించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, వన్డే ప్రపంచ కప్ 2023, టీ20 ప్రపంచ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్‌కు వరకు తీసుకెళ్లిన రోహిత్ మొదటి అంతర్జాతీయ కెప్టెన్ అయ్యాడు. (WTC) ఫైనల్‌లో ఓడీఐ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని పొందింది. అయితే, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చరిత్రలో తొలిసారిగా వరుసగా ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది.