Virat Kohli: రెండో బిడ్డకు జన్మనివ్వనున్న హీరోయిన్ అనుష్క శర్మ.. కోహ్లీ గురించి చెబుతూ కన్ఫర్మ్ చేసిన డివిలియర్స్

దీనిపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ బాగానే ఉన్నాడని, తన కుటుంబంతో గడుపుతున్నాడని తెలిపారు.

Virat Kohli

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అభిమానులకు దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఓ శుభవార్త చెప్పారు. అనుష్క శర్మ మరో బిడ్డకు జన్మనివ్వనుందని అన్నారు. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి రెండు మ్యాచులో కోహ్లీ ఆడడం లేదు.

దీనిపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. కోహ్లీ రెండు మ్యాచులు ఆడలేదని, అతడు క్షేమంగా ఉన్నాడని, ప్రస్తుతం అతను తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడని డివిలియర్స్ తెలిపారు. ఈ కారణం వల్లే కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడని అన్నారు. అనుష్క శర్మ మరో బిడ్డకు జన్మనివ్వనుందని అన్నారు. ఇంతకు మించి తానేమీ చెప్పాలనుకోవడం లేదని అన్నారు. తన మొబైల్‌లో టెక్స్ట్ మెసేజ్ చూస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

కోహ్లీ, అనుష్క తమ రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ సమయం అతడికి చాలా ముఖ్యమని అన్నారు. చాలా మందికి తమ మొదటి ప్రాధాన్యత కుటుంబమే అని చెప్పారు. విరాట్‌ను ఫ్యాన్స్ అంచనా వేయలేరని, టెస్టుల్లో అతడిని ప్రస్తుతం చూడలేకపోతున్నామని అన్నారు. డివిలియర్స్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విషయం తెలిసిందే. కోహ్లీకి ఆయన మంచి స్నేహితుడు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ఇప్పటికే ఒక పాప ఉన్న విషయం తెలిసిందే. 2020లో తమ మొదటి బేబీ గురించి అనుష్క, కోహ్లీ వివరాలు తెలిపారు. అనుష్క ప్రెగ్నెంట్ అని తెలుపుతూ కోహ్లీ అప్పట్లో ఫొటో పోస్ట్ చేశాడు. 2021 జనవరి 11న పుట్టిన ఆ పాపకు ‘వామిక’ అని పేరు పెట్టారు.

ఇటీవల కోహ్లీ, అనుష్క ఒక హోటల్లో కనపడిన వీడియో వైరల్ అయింది. అనుష్క బేబీ బంప్‌తో కనిపిస్తోందని కొందరు కామెంట్లు చేశారు. రెండో బిడ్డకు అనుష్క జన్మనివ్వబోతుందని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏబీ డివిలియర్స్ ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ, ఆ ప్రచారంలో నిజమేనని స్పష్టతనిచ్చారు.

ఇంగ్లాండ్‌ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. రెండో టెస్టులో ప‌ట్టుబిగించిన భార‌త్‌.. ముగిసిన రెండో రోజు ఆట‌