Virat Kohli-Joe Root
Virat Kohli-Joe Root : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ లు కలిసి సరికొత్త చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరు ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో వీరు ఇద్దరు కూడా డకౌట్లు అయ్యారు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచులో ఇరు జట్లలో నంబర్ 3 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లు డకౌట్లు కావడం ఇదే మొదటి సారి.
మొదట విరాట్ కోహ్లీ.. ఆ తరువాత జో రూట్
టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9) పరుగులకే ఔట్ కావడంతో భారత్ 26 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. దీంతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తం 9 బంతులు ఆడిన కోహ్లీ పరుగులు ఏమీ చేయలేదు. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ క్యాచ్ అందుకోవడంతో డకౌట్‌గా వెనుదిరిగాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 30 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ మలన్ వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ లో వచ్చిన రూట్‌ను మహ్మద్ షమీ మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో రూట్ గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
బార్మీ ఆర్మీ అతి.. భారత ఫ్యాన్స్ కౌంటర్
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో అతడిని హేళన చేస్తూ.. బాతుకు అతడి ఫోటోని అతికించి అతి చేసింది ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కు చెందిన బార్మీ ఆర్మీ. అయితే.. వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇంగ్లాండ్ జట్టులో నిలకడకు మారు పేరు, రన్ మెషిన్‌గా పేరుపొందిన జో రూట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు కూడా కౌంటర్ ఇచ్చారు.
Karma is a bitch Barmy Army ??? #INDvsENG https://t.co/pHMSWlqfCG pic.twitter.com/cSvOAHrcdq
— Maddy (@maddified18) October 29, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (87), సూర్యకుమార్ యాదవ్ (49) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్ ఓ వికెట్ సాధించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్ (27) ఫర్వాలేనిపించగా..మిగిలిన వారు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు, బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశారు.
WIN by ? runs in Lucknow ✅
? of the table with 6⃣ wins in a row!#TeamIndia ??#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/oKmCLpCzUt
— BCCI (@BCCI) October 29, 2023