Virat Kohli and Rohit Sharma names removed from ICC ODI rankings list
ODI rankings : ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్(ODI rankings)లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) పేర్లు కనిపించడంలేదు. గత వారం రోహిత్ రెండో స్థానంలో ఉండగా, కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే.. వారం తిరిగేలోపే వారిద్దరి పేర్లు ర్యాంకింగ్స్ జాబితాలో కనిపించకుండా పోయాయి. ఇది వారి ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానులకు షాక్ కు గురిచేసింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ఫార్మాట్లలో వీరిద్దరికి ర్యాంకింగ్స్ ఉండవు అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లోనూ వీరిద్దరి పేర్లు కనిపించకపోవడంతో ఈ ఇద్దరూ వన్డేలకు కూడా సడెన్‌గా గుడ్ బై చెప్పేందుకు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
Vinod Kambli : వినోద్ కాంబ్లీ ఇంకా పూర్తిగా కోలుకోలేదా? అతడి సోదరుడు ఏం చెప్పాడంటే?
ఐసీసీ ర్యాంకింగ్స్ నుంచి ఓ ఆటగాడి పేరును ఎప్పుడు అదృశ్యమవుతుందంటే?
సాధారణంగా ఓ ఆటగాడు నిర్ణీత కాల వ్యవధిలో అంటే 9 నుంచి 12 నెలల కాలంలో సంబంధింత ఫార్మాట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. అదే విధంగా రిటైర్‌మెంట్ అయితే అప్పటి నుంచే తొలగిస్తారు. ఇక రో-కో ద్వయం ఇప్పటి వరకు అధికారికంగా వన్డేల నుంచి రిటైర్‌మెంట్ కాలేదు.
Why have Rohit Sharma and Virat Kohli been removed from the ICC ODI Rankings? 😭 pic.twitter.com/TbrotWUfcR
— Selfless⁴⁵ (@SelflessCricket) August 20, 2025
చివరి సారిగా వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. అంటే.. వీరిద్దరు వన్డేల మ్యాచ్‌లు ఆడక కేవలం ఐదు నెలల మాత్రమే అయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేర్లను వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించడానికి వీల్లేదు. ఇది ఓ సాంకేతిక లోపం అయి ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
The Hundred 2025 : వామ్మో.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు..
ఇదిలా ఉంటే.. వన్డే ర్యాంకింగ్స్ నుంచి రోహిత్, కోహ్లి పేర్లు తొలగింపు తరువాత కూడా శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. శ్రేయస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు.
అక్టోబర్‌లోనేనా..?
టీమ్ఇండియా అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటనుంది, ఈ పర్యటనలో భారత జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. అక్టోబర్ 19 పెర్త్ వేదికగా జరిగనున్న తొలి వన్డే మ్యాచ్ ద్వారా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జెర్సీలో మళ్లీ మైదానంలోకి దిగనున్నారు.